Sirivennela: విషమంగా సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి
సోమవారం సాయంత్రం కిమ్స్ హాస్పిటల్ వర్గాలు సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి.
ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను హైదరాబాద్‌లోని కిమ్స్ హస్పిటల్‌లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. న్యుమోనియాతోనే ఆయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని.. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో లేరని ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే.. మంగళవారం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సోమవారం సాయంత్రం కిమ్స్ హాస్పిటల్ వర్గాలు సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ నవంబరు 24న ఆస్పత్రిలో చేరారని.. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటిప్పుడు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఐసీయూలో ఉన్న సీతారామశాస్త్రి త్వరగా కోలుకునేందుకు అవసరమైన ట్రీట్మెంట్ ను అందిస్తున్నట్లు చెప్పారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం అని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు చేంబోలు సీతారామశాస్త్రి. పదోతరగతి వరకు అనకాపల్లిలోనే చదువుకున్న ఆయన.. ఇంటర్ చదవడం కోసం కాకినాడ వెళ్లారు. ఆ తరువాత ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. తెలుగు భాషపై మంచి గ్రిప్ ఉండడంతో.. ఎంఏ చదువుతుండగానే ఆయనకు అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. దర్శకుడు కె. విశ్వనాథ్ రూపొందించిన సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయనకే ఇచ్చారు. ఈ సినిమాతో గీతరచయితగా సీతారామ శాస్త్రికి మంచి గుర్తింపు వచ్చింది. అందుకే సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారింది. ఇప్పటివరకు మూడు వేలకు పైగా పాటలు రాసిన ఆయన.. పదినంది అవార్డులను, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా సాధించారు. ఆయన రాసిన పాటల్లో కొన్ని ఆణిముత్యాలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.
Also Read: కాజల్ ని టార్గెట్ చేసిన సిరి, షణ్ముఖ్.. మరోసారి మానస్ పై మండిపడ్డ శ్రీరామ్..
Also Read: కొరటాల అదిరిపోయే స్టఫ్.. అందరి కళ్లు 'ఆచార్య'పైనే..
Also Read: ఇంటర్నేషనల్ సినిమాలో సమంత.. రానా సజెషనా..?
Also Read:పాయల్ బోల్డ్ వీడియో.. వెంటనే డిలీట్ చేసేసింది..
Also Read: 'రాధే శ్యామ్'లో రెండో సాంగ్ టీజర్ వచ్చింది... చూశారా?
Also Read: అమిత్ షా మీద జోక్ వేశాడని... ఎక్కడా ఏ జోక్ వేయడానికి వీలు లేకుండా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి