News
News
X

Singer Smita: నెపొటిజాన్ని ప్రేరేపిస్తున్నదే ప్రేక్షకులు, నాని సంచలన వ్యాఖ్యలు

సినిమా పరిశ్రమలో నెపొటిజంపై హీరోలు రానా, నాని సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులే నెపొటిజాన్ని ప్రేరేపిస్తున్నారంటూ విమర్శించారు. ‘నిజం విత్‌ స్మిత’ టాక్‌ షో ఈ కామెంట్స్ చేశారు.

FOLLOW US: 
Share:

తెలుగు, తమిళ, హిందీ సినిమా పరిశ్రమ అనే తేడా లేదు. ప్రతి చోటా నెపొటిజనం అనేది కొనసాగుతూనే ఉంది. అయితే, బాలీవుగ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఈ నెపొటిజం వివాదం మరింత ముదిరింది. అంతేకాదు, బాలీవుడ్ లో నెపొటిజాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో బాయ్ కాట్ బాలీవుడ్ అనే క్యాంపెయిన్ జోరుగా కొనసాగింది. ఈ క్యాంపెయిన్ దెబ్బకు హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రహీరోలుగా కొనసాగుతున్న వారి సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయంతో ఆయన ఏకంగా సినిమాలకు కొంత కాలం విరామం ప్రకటించారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరుచుగా బాలీవుడ్ లో నెపొటిజంపై విమర్శలు సందిస్తూనే ఉంటుంది.

టాలీవుడ్ లోనూ నెపొటిజంపై చర్చ

తాజాగా టాలీవుడ్ లో నెపొటిజంపైనా కొంత చర్చ జరిగింది. అడవి శేష్ లాంటి వాళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్న నెపోటిజాన్ని కొద్ది కాలం క్రితం ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. తాజాగా నెపోటిజంపై నేచురల్‌ స్టార్‌ నాని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా సోనీలైవ్‌ ‘నిజం విత్‌ స్మిత’ అనే టాక్ షోలో హీరో రానాతో కలిసి ఆయన పాల్గొన్నారు. త్వరలో స్ట్రీమింగ్ కు రానున్న ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఇందులో నాని, రానా నెపొటిజంపై స్పందించారు.  

నెపొటిజంపై నాని సంచలన వ్యాఖ్యలు

నెపొటిజంను పెంచి పోషిస్తున్నదే ప్రేక్షకులు అంటూ నాని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. “అసలు నెపోటిజంని పెంచి పోషిస్తుంది ప్రేక్షకులే. నాని డెబ్యూ మూవీ లక్షల్లో చూస్తే.. రామ్ చరణ్ డెబ్యూ మూవీ కోట్లలో చూశారు.  ఆ లెక్కన నెపోటిజాన్ని ప్రోత్సహిస్తుంది జనాలే కదా” అంటూ వ్యాఖ్యానించారు. అటు రానా ఇదే అంశంపైనా స్పందించారు.  ‘తల్లిదండ్రుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంది. పిల్లలు దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లినప్పుడే వారు సక్సెస్‌ అయినట్లు” అని రానా చెప్పారు. వీరిద్దరిలో రానాకు బీభత్సమైన సినీ బ్యాగ్రౌండ్ ఉండగా, నాని ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. త్వరలో ఈ షో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

View this post on Instagram
 
A post shared by Sony LIV (@sonylivindia)

బాలయ్య షోతో పోటీగా స్మిత షో 

ప్రముఖ సింగర్‌ స్మిత ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇటివలే ప్రారంభమైన ఈ షోలో మెగాస్టార్‌ చిరంజీవి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు వంటి ప్రముఖులు పాల్గొన్నారు. తాజాగా ఈ నాని, రానా ఈ షోలో పాల్గొన్నారు.  బాలయ్య `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె` అంటూ సెలబ్రిటీస్ టాక్ షోని ప్రారంభించారు. ఈ షో రెండో సీజన్ ఎండింగ్ ఎపిసోడ్ నాడే ‘నిజం విత్ స్మిత’ టాక్ షో మొదలయ్యింది. ఈ షో సైతం మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది.

Read Also: దట్టమైన అడవిలో కుక్కలతో పోరాటం, ఒళ్లు గగుర్పొడిచేలా ఆండ్రియా `నో ఎంట్రీ` ట్రైలర్

Published at : 21 Feb 2023 05:59 PM (IST) Tags: Hero Nani Rana nepotism Ram Charan Singer Smita show

సంబంధిత కథనాలు

Manisha Koirala: ‘బొంబాయి’ సినిమా చేయకూడదు అనుకున్నాను, ఆయన వల్లే చేశా: మనీషా కొయిరాలా

Manisha Koirala: ‘బొంబాయి’ సినిమా చేయకూడదు అనుకున్నాను, ఆయన వల్లే చేశా: మనీషా కొయిరాలా

Dasara Collections USA: అమెరికాలో ‘దసరా’ ధూమ్ ధామ్, తొలి రోజు బ్లాక్సాఫీస్ ద్గరగ కలెక్షన్ల సునామీ

Dasara Collections USA: అమెరికాలో ‘దసరా’ ధూమ్ ధామ్, తొలి రోజు బ్లాక్సాఫీస్ ద్గరగ కలెక్షన్ల సునామీ

NBK108 Dussehra Release : దసరా బరిలో బాలకృష్ణ సినిమా - రామ్, విజయ్, రవితేజ సినిమాలతో పోటీ

NBK108 Dussehra Release : దసరా బరిలో బాలకృష్ణ సినిమా - రామ్, విజయ్, రవితేజ సినిమాలతో పోటీ

Balagam - LACA Awards: లాస్ ఏంజెల్స్ అవార్డు వేడుకలో సత్తా చాటిన ‘బలగం‘, రెండు విభాగాల్లో ప్రతిష్టాత్మక అవార్డులు

Balagam - LACA Awards: లాస్ ఏంజెల్స్ అవార్డు వేడుకలో సత్తా చాటిన ‘బలగం‘, రెండు విభాగాల్లో ప్రతిష్టాత్మక అవార్డులు

నాటు నాటు పాట కోసం 19 నెలలు - చంద్రబోస్ చెప్పిన సీక్రెట్స్

నాటు నాటు  పాట కోసం 19 నెలలు -  చంద్రబోస్ చెప్పిన సీక్రెట్స్

టాప్ స్టోరీస్

Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఉంది- దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కేడర్‌కు పవన్ సూచన

Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఉంది- దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కేడర్‌కు పవన్ సూచన

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు

ట్విటర్ వేదికగా కేటీఆర్-బండి మాటల యుద్ధం- మధ్యలో కాంగ్రెస్‌ కౌంటర్‌!

ట్విటర్ వేదికగా కేటీఆర్-బండి మాటల యుద్ధం- మధ్యలో కాంగ్రెస్‌ కౌంటర్‌!

Mosquito Coil Fire Delhi: ఢిల్లీలో దారుణం, ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్

Mosquito Coil Fire Delhi: ఢిల్లీలో దారుణం, ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్