అన్వేషించండి

No Entry Trailer: దట్టమైన అడవిలో కుక్కలతో పోరాటం, ఒళ్లు గగుర్పొడిచేలా ఆండ్రియా `నో ఎంట్రీ` ట్రైలర్

ఆండ్రియా నటించిన ‘నో ఎంట్రీ‘ ట్రైలర్ వచ్చేసింది. కుక్కల బలాన్ని పెంచేందుకు ఓ సైంటిస్ట్ చేసిన పరిశోధన ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అనే కథతో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది.

మిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గురింపు తెచ్చుకున్న నటి ఆండ్రియా జెరెమియా. విభిన్న కథలతో  తమిళ ప్రేక్షకులను అలరిస్తోంది. `తడాఖా` మూవీతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయం అయ్యింది.  కమల్‌ హాసన్‌తో నటించిన `ఉత్తమ విలన్‌` సినిమాతోనూ ఆకట్టుకుంది. తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ మద్దుగుమ్మ  తాజాగా లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. ఆర్‌ అళగు కార్తిక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరు ‘నో ఎంట్రీ’. జంబో సినిమాస్‌ బ్యానర్‌పై శ్రీధర్‌ అరుణాచలం నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది.

ఒళ్లు గగుర్పొడిచేలా `నో ఎంట్రీ` ట్రైలర్

ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేపడంతో పాటు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. కుక్కల బలాన్ని పెంచితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది ఈ ట్రైలర్ లో చూపించారు.  నాలుగు కుక్కలు కలిస్తే ఏనుగునైనా చంపేయగల శక్తి ఉంటుందనే వాయిస్ మొదలయ్యే ఈ ట్రైలర్ లో కుక్కలు స్వైరవిహారం చేస్తాయి. కుక్కల బలం పెంచేందుకు ఓ సైంటిస్ట్ చేసిన ప్రయోగం ఏమైంది? కుక్కల్లో పుట్టిన అతి భయంకరమైన వైరస్‌ మనుషులపై ఎలా దాడి చేసిందనే అంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉత్కంఠభరిత సన్నివేశాలతో ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరణంగా సాగింది.  కుక్కలు మనుషులను కరవడం, మనుషులు, మనుషులనే కరవడం వంటి సన్నివేశాలు సినిమా పై ఓ రేంజిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి.

కుక్కల చూట్టూనే తిరుగుతున్న కథ

కుక్కలకు బలాన్ని పెంపొందించే ప్రయోగం చేసిన శాస్త్రవేత్త ఆండ్రియా తండ్రి. ఆయన చివరగా పంపించిన ఫోటో ఆధారంగా తనను వెతుక్కుంటూ మిత్రులతో కలిసి దట్టమైన అటవీ ప్రాంతానికి చేరుకుంటారు. అడవిలోని కొండ శిఖరంలో ఓ విల్లాలో ఉంటారు. ఆ ఇంటిని క్రూరమైన అడవి కుక్కలు చుట్టుముడతాయి. ఆ కుక్కల భారీనుండి వారు ఏ విధంగా తప్పించుకున్నారు? ఈ కుక్కలకు బలం పెంచి ఏం చేయాలి అనుకున్నారు? అనేది ఈ చిత్ర కథగా తెలుస్తోంది.

యాక్షన్ పాత్రలో మెప్పించబోతున్న ఆండ్రియా

ఈ సినిమాను ఆద్యతం థ్రిల్లింగ్‌గా, రోమాలు నిక్కబొడుచుకునేలా తెరకెక్కించారు.  అద‌వ్ క‌ణ్ణ‌దాస‌న్‌,ర‌న్య‌రావ్‌, మాన‌స్‌, జ‌య‌శ్రీ‌, జాన్‌వీ ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు.   ఇప్పటివరకు ఫ్యామిలీ, లవ్, కామెడీ చిత్రాల్లో నటించిన ఆండ్రియా.. ఈ చిత్రంలో యాక్షన్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. అటవీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘నో ఎంట్రీ’  చిత్రంలో ఆమె సరికొత్త పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో  ఆండ్రియా ఎంతో సాహసంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌ పాత్ర చేస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌ లుక్ పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  త్వ‌ర‌లోనే ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల‌కానుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah)

Read Also: యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్, ‘సిటాడెల్‌’ కోసం సమంత ఎంత కష్టపడుతుందో చూశారా!

టాప్ హెడ్ లైన్స్

Tejaswini Nandamuri Tollywood Debut : సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
Newton's 3rd Law Movie Review - న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Newtons 3rd Law OTT : రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Embed widget