Samantha Ruth Prabhu: యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్, ‘సిటాడెల్’ కోసం సమంత ఎంత కష్టపడుతుందో చూశారా!
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమంతా మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. ‘సిటాడెల్’ షూట్ కోసం చాలా కష్టపడుతోంది. ఇందులోని హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోంది.
2022 నుంచి మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత, కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకున్న . తాజాగా మళ్లీ షూటింగ్స్ లో బిజీ అవుతోంది. ప్రస్తుతం రాజ్-డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న రస్సో బ్రదర్స్ ప్రాజెక్ట్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో నటిస్తున్నది. వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న ఈ సిరీస్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా చిత్ర బృందంతో సమంత జాయిన్ అయ్యింది. హాలీవుడ్ షో ‘సిటాడెల్’కు రీమేక్‌గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇందులో వరుణ్ ధావన్, సమంత గూఢచారి పాత్రలు పోషిస్తున్నారు.
8 డిగ్రీస్ యాక్షన్ సీన్స్ కోసం సమంత స్పెషల్ ట్రైనింగ్
ఇక సమంతా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం చాలా కష్టపడుతోంది. 8 డిగ్రీల చలిలో యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ప్రస్తుతం ‘సిటాడెల్’ షూటింగ్ ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ లో జరుగుతున్నాయి. యాక్షన్ సీన్స్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్న వీడియోను సమంతా ఇన్ స్టాలో షేర్ చేసింది. స్టన్నర్ షూటింగ్ కోసం ప్రిపేర్ సమయంలో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ల కోసం ఎలా కష్టపడుతుందో ఈ వీడియోలో కనిపించింది.
View this post on Instagram
‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్, సమంతా ఇద్దరూ కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలలో కనిపిస్తారు. వీటి కోసం మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కోసం మేకర్స్ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌ను తీసుకున్నారు. ఈ సినిమాలోని ఎక్కువ భాగం ముంబైలో షూట్ చేయనున్నారు. కొంత భాగం తూర్పు యూరోపియన్ దేశాలలో షూట్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఉన్న బాబా నీమ్ కరోలి మందిర్ అద్భుత ఫోటోను సమంతా షేర్ చేసింది. దానికి 'వైట్ హార్ట్' అని క్యాప్షన్ ఇచ్చింది.
‘సిటాడెల్’ వెబ్ సిరీస్ గురించి..
రాజ్, డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో వరుణ్ ధావన్, సమంతా పాల్గొంటున్నారు. మేకర్స్ సాసీ అవతార్‌లో స్టన్నర్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆమె బ్రౌన్ లెదర్ జాకెట్‌తో పాటు మ్యాచింగ్ షేడ్స్, బ్లాక్ డెనిమ్‌లో పోజులిచ్చింది. ‘సిటాడెల్’ ఇంటర్నేషనల్ సిరీస్‌కి రీమేక్. దీనిని దర్శక ద్వయం రస్సో బ్రదర్స్ రూపొందిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్, స్టాన్లీ టుక్సీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక సమంత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమె’ సిటాడెల్’లో నటించదని గతంలో ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆమె కచ్చితంగా నటిస్తుందని రాజ్, డీకే తేల్చి చెప్పారు. అనుకున్నట్లుగానే ప్రస్తుతం సమంతా ఈ సిరీస్ లో భాగం అవుతోంది. ఇక సామ్, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న ‘ఖుషీ’ చిత్రం వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం సమంత ఇప్పటికే డేట్లు కేటాయించిందని సమాచారం. మరోవైపు ఆమె నటించిన ‘శాకుంతలం’ వచ్చే నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: బాలీవుడ్ కు ఎందుకు దూరం అయ్యానంటే? క్లారిటీ ఇచ్చిన ఆపిల్ బ్యూటీ