అన్వేషించండి

Hansika Motwani: బాలీవుడ్ కు ఎందుకు దూరం అయ్యానంటే? క్లారిటీ ఇచ్చిన ఆపిల్ బ్యూటీ

బాలనటిగా బాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టిన హన్సిక, ఆ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమకు దూరం అయ్యింది. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగినా, ఎందుకు సౌత్ లోనే ఉండాల్సి వచ్చిందో తాజాగా వివరించింది.

పంజాబీ బ్యూటీ హన్సిక మోత్వాని బాలీవుడ్ నుంచే సినీ కెరీర్ మొదలుపెట్టింది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘కోయి మిల్ గయా‘ సినిమాలో చిన్నారి హన్సికగా నటించి మెప్పించింది. 2008లో వ‌చ్చిన ‘మ‌నీ హై తో హ‌నీ హై‘ లో తెరపై అలరించింది. ఆ తర్వాత బాలీవుడ్ ను వదిలి సౌత్ లోకి అడుగు పెట్టింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేశముదురు‘ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన వైశాలిగా నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.  ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగుతో పాటు తమిళ సినీ పరిశ్రమల్లో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. మలయాళం, కన్నడ సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్, కోలీవుడ్ మీదే బాగా ఫోకస్ పెట్టింది.      

బాలీవుడ్ లో సినిమాలు ఎందుకు చేయడం లేదంటే?

 సౌత్ సినిమా పరిశ్రమ గురించి కాసేపు పక్కన పెడితే, తన కెరీర్ మొదలు పెట్టిన బాలీవుడ్ లో మాత్రం పెద్దగా రాణించలేకపోయింది హన్సిక.  సౌత్ లో వరుస అవకాశాలు రావడంతో నార్త్ వైపు  కన్నెత్తి చూడలేదు. తాజాగా బాలీవుడ్ లో ఎందుకు సినిమాలు చేయలేదు అనే విషయంపై హన్సిక క్లారిటీ ఇచ్చింది. “తనకు అన్ని భాషలు ఒకటే. ఒకే భాషలో సినిమాలు చేయాలనే ఉద్దేశం లేదు. ఎక్కడ అవకాశాలు ఎక్కువగా వస్తే అక్కడే నటిస్తాను. ప్రస్తుతం నాకు సౌత్ లో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అందుకే అక్కడే సినిమాలు చేస్తున్నాను.  నేను ఎంటర్‌టైనర్‌ని, నాకు భాష అడ్డంకి కాదు, ఎక్కడ అవకాశం వచ్చినా ప్రేక్షకులను అలరిస్తాను" అని వెల్లడించింది.

సౌత్ నుంచి వరుస అవకాశాలు

అంతేకాదు, గత సంవత్సరం కాలంలో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. 2022లో తెలుగు, తమిళ భాషల్లో సుమారు 10 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.  ‘మై నేమ్ ఈజ్ శృతి', 'ఎంవై3’, ‘రౌడీ బేబీ ఫిలిమ్స్’, ‘పార్ట్‌న‌ర్‌’ సినిమాతో పాటు విజ‌య్ చంద‌ర్ తోనూ మూవీ ఆఫర్ వచ్చింది. చేతినిండా అవకాశాలు రావడంతో నార్త్ సినిమాల వైపు తను ఎదురు చూడటం లేదు. అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని చెప్పతోంది ఈ ముద్దుగుమ్మ.      

గతేడాది డిసెంబర్ లో హన్సిక తన ప్రియుడు సోహెల్ కతురియాను పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. వీరి వివాహ వేడుక ‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో డిస్నీ ప్లస్ హార్ట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. అందుతో తన కెరీర్, కుటుంబం, ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలను హన్సిక పంచుకుంటోంది. తన గురించి ఊహాగానాలకు తావులేకుండా ఈ సిరీస్ ద్వారా అన్ని విషయాలను వెల్లడించాలి అనుకుంటున్నట్లు చెప్పింది. తన లైఫ్ గురించి అందరికీ తెలియజేయాలని భావించడం తన దృష్టిలో గొప్ప నిర్ణయంగా ఆమె వెల్లడించింది.  

Read Also: ప్రముఖ సింగర్ సోను నిగమ్ పై దాడి, హాస్పిటల్ కు తరలింపు, దాడికి కారణం ఏంటంటే?

టాప్ హెడ్ లైన్స్

Mahesh Babu Looks : రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
Mahesh Babu Varanasi : వారణాసి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది - మన రుద్ర మహేశ్ బాబు
వారణాసి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది - మన రుద్ర మహేశ్ బాబు
Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget