Sonu Nigam Attack: ప్రముఖ సింగర్ సోను నిగమ్ పై దాడి, హాస్పిటల్ కు తరలింపు, దాడికి కారణం ఏంటంటే?
ప్రముఖ సింగర్ సోను నిగమ్ పై దాడి జరిగింది. ముంబైలో జరిగిన ఓ మ్యూజికల్ ఈవెంట్ లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో సోను నిగమ్ తో పాటు అతడి స్నేహితుడు, బాడీ గార్డు గాయపడ్డారు.
ముంబైలో దుండగులు రెచ్చిపోయారు. ఓ మ్యూజికల్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ మీద దాడి చేశారు. కొంత మంది ఆకతాయి ముఠా ఈ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో సోను నిగమ్, ఆయన స్నేహితుడు, బాడీ గార్డు గాయపడ్డారు. వెంటనే ఈవెంట్ నిర్వాహకులు ఆయనను అక్కడి నుంచి సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
స్టేజి దిగుతుండగా సింగర్ సోనుపై దాడి
మరోవైపు ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోను నిగమ్ స్టేజి మీది నుంచి కిందికి దిగి వస్తుండగా దుండగులు దాడి చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ముందు ఓ వ్యక్తి అతడి కాలును పట్టుకుని నిలువరించే ప్రయత్నం చేశాడు. కొంత మంది స్టేజి మీది నుంచి మరికొంత మంది స్టేజి కిందినుంచి పైకి వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో సోను మిత్రుడు రబ్బానీ ఖాన్, బాడీ గార్డు కిందపడిపోయారు. వెంటనే నిర్వాహకులు దాడికి యత్నించిన వారిని అడ్డుకున్నారు. ఆ తర్వాత సోనుతో పాటు గాయపడిని వారిని జైన్ హాస్పిటల్ కు తరలించారు.
సోను నిగమ్ పై దాడి వెనుక ఎమ్మెల్యే కొడుకు హస్తం!
చెంబూరులో జరిగిన మ్యూజికల్ ఈవెంట్ కోసం సోను నిగమ్ తన టీమ్ తో అక్కడికి వచ్చారు. కార్యక్రమం అయ్యాక కిందికి దిగి వస్తున్న సమయంలో కొందరు సెల్ఫీల కోసం ప్రయత్నించారు. సెక్యూరిటీ వారిని వద్దని చెప్పడంతో మెట్లు దిగే సమయంలో దాడి చేశారు. ఈ ఘటనలో సోనుకు గాయాలయ్యాయి. అయితే, సింగర్ నిమగ్ పై దాడి ఘటన ముంబైలో సంచలనం అయ్యింది. దాడికి పాల్పడింది ఎవరు? కావాలనే దాడి చేశారా? లేక తోపులాటలో గాయపడ్డారా? అనే చర్చ జరుగుతోంది. అయితే, సెల్ఫీ నిరాకరించడంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్ కొడుకు ఈ దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు సింగర్ సోను నిగమ్ ప్రస్తుతం బాగానే ఉన్నారు. ఆయనకు మరీ ప్రమాదకర స్థాయిలో గాయాలు కాలేదని వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేసుకున్నారు. దాడికి యత్నించిన నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
#SonuNigam attacked by Uddhav Thackeray MLA Prakash Phaterpekar son and his goons in music event at Chembur. Sonu has been taken to the hospital nearby. pic.twitter.com/ERjIC96Ytv
— Swathi Bellam (@BellamSwathi) February 20, 2023
View this post on Instagram
Read Also: నెట్ ఫ్లిక్స్ చీఫ్‌ను కలిసిన జక్కన్న - SSMB29 కోసమేనా ఈ మీటింగ్?