Siddharth: ఆ రోజు వస్తే యాక్టింగ్ మానేస్తా - హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
హీరో సిద్ధార్థ్ 'ఎస్కేప్ లైవ్' అనే హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ ఎన్నో హిట్టు సినిమాల్లో నటించారు. ఆ తరువాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కి వెళ్లిపోయారు. అక్కడే ఒకట్రెండు సినిమాలు చేస్తూ గడిపారు. మధ్యలో ఆయన నటించిన హారర్ ఫిల్మ్ 'గృహం'ను తెలుగులో రిలీజ్ చేశారు. చాలా కాలం గ్యాప్ తరువాత 'మహాసముద్రం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో సిద్ధార్థ్ కి కలిసొచ్చిందేమీ లేదు. ప్రస్తుతం ఈ హీరో 'ఎస్కేప్ లైవ్' అనే హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ ను డిస్నీ హాట్ స్టార్ లో మే 20 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో 'ఎస్కేప్ లైవ్'పై అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సిరీస్ ను మరింతగా ప్రమోట్ చేస్తుంది టీమ్. ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా సిద్ధార్థ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సిరీస్ లో తన పాత్ర రెగ్యులర్ గా ఉండదని.. ఈ పాత్రలో తనను ఎంపిక చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంచి ఆఫర్లు వస్తే మళ్లీ బాలీవుడ్ కి తిరిగొస్తానని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ రోల్స్ వచ్చేవరకే నటిస్తానని.. లేదంటే యాక్టింగ్ మానేసి వేరే ఉద్యోగం చేసుకుంటానని అన్నారు.
Also Read: విజయ్ దేవరకొండ సినిమాకు డేట్స్ ఇచ్చిన పూజా హెగ్డే, ఎన్ని రోజులు అంటే?
Also Read: రెండో రోజు 'సర్కారు వారి పాట' కలెక్షన్స్ తగ్గాయా? మహేష్ బాబు సినిమా ఎంత కలెక్ట్ చేసింది?
View this post on Instagram
View this post on Instagram