By: ABP Desam | Updated at : 14 May 2022 09:28 AM (IST)
పూజా హెగ్డే
Pooja Hegde signs Vijay Devarakonda's JGM Movie: క్వీన్ ఆఫ్ టాలీవుడ్, పాన్ ఇండియా హీరోయిన్ ఎవరు? అంటే పూజా హెగ్డే పేరు చెప్పాలేమో! సినిమా హిట్టూ ఫ్లాపులకు అతీతంగా పూజా హెగ్డేకు అవకాశాలు వస్తున్నాయి. బుట్ట బొమ్మను తమ సినిమాలో నాయికగా తీసుకోవడానికి అగ్ర దర్శకులు, యంగ్ స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... విజయ్ దేవరకొండకు జోడీగా పూజా హెగ్డే కనిపించనున్నారు.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'జన గణ మణ' (VD's Jana Gana Mana Movie). ఇందులో కథానాయికగా పూజా హెగ్డే నటించనున్నారు. ఇటీవల ఆమెను కలిసిన పూరి జగన్నాథ్ కథ, అందులో ఆమె పాత్ర వివరించారట. స్టోరీతో పాటు తన క్యారెక్టర్ కూడా ఆమెకు నచ్చిందట.
కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, పూజా హెగ్డే జోడీ గురించి వినబడుతోంది. అయితే, శుక్రవారం అగ్రిమెంట్ పేపర్స్ మీద బుట్టబొమ్మ సంతకం చేశారు. ఈ సినిమా షూటింగ్ కోసం పూజా హెగ్డే 45 డేస్ ఇచ్చారని తెలిసింది. జూలై నుంచి ఆమె చిత్రీకరణలో జాయిన్ కావచ్చు. 'జన గణ మణ' సినిమా ముంబైలో ప్రారంభం అయ్యింది. యూరోప్ లొకేషన్స్ లో ఎక్కువ శాతం షూటింగ్ చేయనున్నారట.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'జన గణ మణ' విడుదల కానుంది. వచ్చే ఏడాది ఆగస్టు 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని సినిమా ప్రారంభమైన రోజున వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చికి షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారు.
Also Read: తమిళ దర్శకుడికి అవకాశం ఇచ్చిన రవితేజ
'జన గణ మణ' కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందనున్న తాజా సినిమాలో పూజా హెగ్డే నటించనున్నారు. హిందీలో సల్మాన్ ఖాన్ 'కబీ ఈద్ కబీ దివాలీ' సినిమా చేస్తున్నారు. శుక్రవారం ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ సినిమా 'భవదీయుడు భగత్ సింగ్'లో కూడా పూజా హెగ్డే హీరోయిన్. అయితే, ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Also Read: టేబుల్ ఫ్యాన్‌లో చున్నీ, ఇది చాలా ఫన్నీ! ఇలా కూడా చచ్చిపోవచ్చా? ఈ సీన్ చూస్తే పడిపడి నవ్వేస్తారు!
NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?
Pooja Hegde: ‘కేన్స్’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!
NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్
Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ
Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు
Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !