By: ABP Desam | Updated at : 23 Jul 2021 04:12 PM (IST)
Raj_Kundra
అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే ఇప్పటివరకు భర్త అరెస్ట్ పై మాట్లాడని శిల్పాశెట్టి.. తొలిసారి సోషల్ మీడియాలో స్పందించింది.
''కోపంలో వెనక్కి తిరిగి చూడకు, భయంగా ఉన్నప్పుడు భవిష్యత్తును చూడకు. పూర్తి అవగాహనతో చుట్టుపక్కల చూడు. మనల్ని బాధపెట్టిన వారి వైపు కోపంతో వెనక్కి తిరిగి చూస్తాం. ఉద్యోగం పోతుందేమో అన్న భయంతోనో, ఏదైనా వ్యాధి బారిన పడతామనో, మనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోతామనే భయంతోనో భవిష్యత్తుతను చూస్తాం. అదృష్టవశాత్తు నేను ఇంకా బతికే ఉన్నానని తెలిసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను.గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. భవిష్యత్తులో కూడా సవాళ్లను ఎదుర్కొంటా. ఏం జరిగినా నేను జీవిస్తాను. దాన్ని ఏ శక్తీ ఆపలేదు'' అంటూ ప్రముఖ రచయిత జేమ్స్ థర్బర్ నవలలోని వ్యాఖ్యలను శిల్పా హైలైట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం శిల్పా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముంబై నగర శివార్లలో 'మాద్ దీవీ'లోని ఓ బంగ్లాలో పోర్న్ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించడంతో.. అక్కడున్న పదకొండు మందిని పోలీసులు అరెస్ట్ చేసి ఐదు నెలలపాటు దర్యాప్తు చేసి పోర్న్ రాకెట్ ను బయటపెట్టారు. ఇందులో భాగంగానే 'హాట్‌షాట్స్' యాప్ నిర్వహిస్తున్న రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేశారు. రాజ్‌కుంద్రా అరెస్ట్ బాలీవుడ్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో శిల్పాశెట్టి ప్రమేయం ఏమైనా ఉందా అన్నదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కేసుతో శిల్పాకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని జాయింట్ పోలీస్ కమిషనర్ మిలింద్ భరంబే విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
రాజ్ కుంద్రా అరెస్ట్ పై స్పందించిన కొందరు సెలబ్రిటీలు రాజ్ కుంద్రా చేసేది వ్యాపారమని.. అందులో పోర్న్ కంటెంట్ లేదని.. ఎరోటిక్ కంటెంట్ మాత్రమే ఉంటుందని అతడికి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు. కొందరు నటీమణులు మాత్రం రాజ్ కుంద్రా తమను ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులు చేశారు. వీరిలో నటి సాగరిక కూడా ఉంది. రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన ఈమె.. తనను అత్యాచారం చేసి, చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని వాపోయింది. రాజ్ కుంద్రా దగ్గర పనిచేసే ఉమేశ్ కావత్ నుంచి తనకు వెబ్ సిరీస్ కోసం పిలుపు వచ్చిందంటూ సాగరిక ఇంటర్వ్యూ ఒకటి వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే వీడియో కాల్ ద్వారా ఆడిషన్ ఉంటుందని, ఈ వీడియోకాల్‌లో నగ్నంగా కనిపించాలని చెప్పడంతో దాన్ని తిరస్కరించానని చెప్పింది.
Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!
Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!
Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?
Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?
Akira Nandan: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్
KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్
AP Government On CPS: సీపీఎస్ అమలు సాధ్యం కాదు- తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం, జీపీఎస్‌కు సహకరించాలని సూచన
Konaseema District: అదుపు తప్పిన కోనసీమ జిల్లా ఉద్యమం- నిరసనకారుల దాడిలో పోలీసులకు తీవ్ర గాయాలు
BreastMilk: బాలింతలకు పాలు బాగా పడాలంటే కొన్ని చిట్కాలు ఇవిగో...