Actor Naresh: డబ్బు కోసం ఆమె నన్ను పెళ్లి చేసుకోలేదు, పవిత్రలో ఆ లక్షణాలు చూశా: నరేష్
Actor Naresh: పవిత్రతో ప్రేమ, పెళ్లి గురించి నటుడు నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బు కోసం ఆమె తనను పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు.
Actor Naresh About Pavitra Lokesh: కొంత కాలం పాటు తెలుగు, కన్నడ సినిమా పరిశ్రమల్లో సీనియర్ నటుడు నరేష్, ప్రముఖ నటి పవిత్రా లోకేష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్, పవిత్ర లోకేష్ తో డేటింగ్ చేయడం బాగా సంచలనం అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరు ప్రధాన పాత్రల్లో 'మళ్ళీ పెళ్లి' అనే సినిమా చేశారు. నరేష్, పవిత్ర సొంత కథనే ఈ సినిమాగా రూపొందించారు. తెలుగు కన్నడ భాషల్లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాగా సంచలనం కలిగించింది. ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని ఆయన మాజీ భార్య రమ్య ఏకంగా కోర్టుకు వెళ్లింది. అయినప్పటికీ, సినిమా విడుదలైంది. కానీ, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
డబ్బు కోసం పవిత్ర పెళ్లి చేసుకోలేదు- నరేష్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్.. డబ్బు కోసమే పవిత్ర తనను పెళ్లి చేసుకుందంటూ వస్తున్న విమర్శల గురించి స్పందించారు. తన కంటే పవిత్ర కుటుంబ సభ్యుల దగ్గరే ఎక్కువ డబ్బు ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అన్నారు. “డబ్బు కోసం పవిత్ర నన్ను పెళ్లి చేసుకుంది అనే విమర్శలలో ఎలాంటి నిజం లేదు. నా కంటే ఎక్కువ డబ్బు ఆమె కుటుంబ సభ్యుల దగ్గరే ఉంది. వాళ్ల డబ్బు కోసం నేనే ఆమెను పెళ్లి చేసుకున్నాను అనుకోవచ్చు కదా? మనీ అనేది సెకెండరీ. ఆమె క్యారెక్టర్ నాకు నచ్చింది. ఆమెలో మా అమ్మను చూశాను. ప్రేమ గానీ, ధైర్యం చెప్పడం గానీ, వంటలు గానీ అన్నింట్లో నాకు మా అమ్మను గుర్తు చేస్తుంది. డబ్బు అనేది ప్రశ్నే కాదు. మాకున్న డబ్బును ఇండస్ట్రీ కోసం ఖర్చు పెట్టాం. అంతేతప్ప, వెనుక వేయలేదు. మా అందరికీ రేపు ఏంటి? అనే ప్రశ్న తలెత్తిన రోజులు ఉన్నాయి. దేవుడు అనుగ్రహించాడు. నేను ఇప్పుడు బిలియనీర్. ప్రస్తుతం నేను బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నాను. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాను. మూడు, నాలుగు తరాలు ఆలోచించాల్సిన అవసరం లేనంత డబ్బు ఉంది. లైఫ్ లో మనీ ఉండాలి. కానీ, మనీ కోసమే లైఫ్ ఉండకూడదు అనుకుంటాను. నా దగ్గర ఉన్న డబ్బుతో సినిమా పరిశ్రమకు ఎంతో కొంత మంచి పని చేస్తున్నాను. నా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాను. ఇప్పటి వరకు 14 దేశాలు తిరిగాను. మొత్తం 30 దేశాలు తిరగాలనేదే నా కోరిక” అని నరేష్ వివరించారు.
నరేష్, పవిత్ర ప్రధాన పాత్రల్లో ‘మళ్లీ పెళ్లి’
అటు నరేష్, పవిత్ర కలిసి నటించి ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమాను ఎంఎస్ రాజు తెరకెక్కించారు. విజయ కృష్ణ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. నరేష్ నిర్మాతగా వ్యవహరించారు. నరేష్, పవిత్ర మధ్య ప్రేమయాణాన్ని 'మళ్ళీ పెళ్లి' పేరుతో వెండితెరపై చూపించారు. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
Read Also: బాలీవుడ్, సౌత్ సినిమాల మధ్య అదే పోలిక - ‘సలార్’ ఫేమ్ టిన్ను ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు