News
News
X

Sarath Kumar on Varalakshmi: ఇద్దరు అబ్బాయిలను కొట్టిందని వరలక్ష్మిని పోలీస్ స్టేషన్‌లో పెట్టారు: తండ్రి శరత్ కుమార్

దక్షిణాది నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా ‘కొండ్రాల్ పావమ్’ అనే తమిళ్ సినిమాలో హీరోయిన్ నటించింది. ఈ మూవీ ట్రైలర్ అవిష్కరణ కార్యక్రమం ఇటీవలే జరిగింది.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి తెలియని వారుండరు. 2012లో వచ్చిన ‘పోడాపోడి’ అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ శరత్ కుమార్. ప్రస్తుతం అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగు లోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఆమె ‘కొండ్రాల్ పావమ్’ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వరలక్ష్మీ గురించి ఆమె తండ్రి శరత్ కుమార్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆమె సినిమా జీవితంతో పాటు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం శరత్ కుమార్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

అప్పుడు అవసరమా అన్నాను, ఇప్పుడు గర్వపడుతున్నాను : శరత్ కుమార్

‘కొండ్రాల్ పావమ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శరత్ కుమార్ వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి మాట్లాడారు. ఈ వేదికపై అందరూ వరలక్ష్మీని విజయశాంతి తో పోలుస్తున్నారని, అది నిజమేనన్నారు. అయితే ఆమె మొదట్లో సినిమాల్లోకి వస్తానని అన్నప్పుడు తాను ఇప్పుడు సినిమాలు అవసరమా అని అడిగానని అన్నారు. కానీ వరలక్ష్మీ మాత్రం సినిమాలు చేయడానికే సిద్దమైందని, అయితే ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి ఆమె శ్రమే కారణమని తెలిపారు. తండ్రి బ్యాగ్రౌండ్ ఉన్నా స్వశక్తితో ఆమె పైకి ఎదిగిందని చెప్పుకొచ్చారు శరత్ కుమార్. 

వరలక్ష్మీ బోల్డ్ అండ్ బ్రేవ్ ఉమెన్

అదే కార్యక్రమంలో శరత్ కుమార్ మాట్లాడుతూ.. వరలక్ష్మీ చాలా ధైర్యసాహసాల గల అమ్మాయి అని అన్నారు శరత్ కుమార్. ఈ సందర్భంగా ఓ సంఘటనను గుర్తు చేశారు. ఓసారి తనకు రాత్రి సమయంలో మీ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఉందంటూ నుంచి ఫోన్ వచ్చిందని, ఆమె ఇద్దరు అబ్బాయిల్ని కొట్టినట్లు తెలిసిందని చెప్పారు. అయితే వారు అంతకముందు ఆమె కారుని ఢీ కొట్టడమే కాకుండా అల్లరి చేయడంతో ఆమె వారిద్దరినీ చితకబాదిందని అన్నారు. చిన్నప్పటి నుంచీ వరలక్ష్మీ ధైర్యశాలి అని చెప్పుకొచ్చారు. 

ఏ పాత్రలోనైనా మెప్పిస్తూ ఈ స్థాయికి..

వరలక్ష్మీ సినిమా జీవితం అంత సులువుగా ఏమీ సాగలేదు. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా.. దానని ఉపయోగించుకోకుండా తన సక్సెను హిస్టరీను ఆమె రాసుకుంది. తన మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడమే కాకుండా తరువాత వరుసగా సినిమాలు చేసినా అవి అంతగా ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. దీంతో ఆమె పై ట్రోల్స్ మొదలైయ్యాయి. ఇక ఆమె సినిమా కెరీర్ అయిపోయిందంటూ వార్తలు వచ్చాయి. అయితే 2019 లో వచ్చిన ‘పందెం కోడి 2’ సినిమాలో విలన్ గా చేసింది వరలక్ష్మీ. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. తర్వాత కేవలం హీరోయిన్ గానే కాకుండా తనకు వచ్చిన ప్రతి పాత్రను చేయడంతో కెరీర్ మళ్లీ గాడిన పడింది. అటు తమిళం, కన్నడ సినిమాల్లో చేస్తూనే మరో వైపు తెలుగులోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది వరలక్ష్మీ. 2019లో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘తెనాలి రామకృష్ణ బి.ఎల్’ సినిమాలో విలన్ గా నటించింది. తర్వాత 2021 లో రవితేజ హీరోగా వచ్చిన ‘క్రాక్’ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి అదరగొట్టింది. దీంతో ఆమెకు తెలుగులోనూ వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. తర్వాత ‘నాంది’, ‘యశోద’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. రీసెంట్ బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాలో విలన్ పాత్ర లో నటించి మరోసారి ప్రేక్షకులను ఆకట్టకుంది. తాజాగా తమిళంలో హీరోయిన్ పాత్రలో ‘కొండ్రాల్ పావమ్’ సినిమాలో చేస్తోంది. ఈ సినిమాకు యాళ్ పద్మనాభన్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 3 న ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Published at : 02 Mar 2023 03:15 PM (IST) Tags: Varalakshmi Sarath Kumar Sarath Kumar Varalakshmi Varalakshmi Sarath Kumar Movies

సంబంధిత కథనాలు

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

Thalapathy Vijay in Insta : ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన తమిళ స్టార్ విజయ్ - గంటలో నయా రికార్డ్

NTR30 Shooting : గోవాకు ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ - ఎప్పటి నుంచి అంటే?

NTR30 Shooting : గోవాకు ఎన్టీఆర్ 30 సెకండ్ షెడ్యూల్ - ఎప్పటి నుంచి అంటే?

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ

Sobhita On Samantha Wedding : సమంత పెళ్లి చేస్తున్న శోభితా ధూళిపాళ

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204

SRH vs RR, IPL 2023: బట్లర్, సంజూ, జైశ్వాల్ బాదుడే బాదుడు! సన్‌రైజర్స్ టార్గెట్‌ 204