అన్వేషించండి

Sapta Sagaralu Dhaati (Side B) Teaser: ఆమె మాటలకు కంటతడి పెట్టిన రక్షిత్, గుండెను కదిలిస్తున్న ‘సప్త సాగరాలు దాటి’ సీక్వెల్ టీజర్

రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’. ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో తెలుగులో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ టీజర్ తాజాగా విడుదల అయ్యింది.

తాజాగా కన్నడ నాట బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్న చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’. రక్షిత్ శెట్టి హీరోగా హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా కనిపించింది.  ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’ సినిమా ముందుగా కన్నడలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యింది. ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు. టాలీవుడ్ లోనూ ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అందమైన జీవితాన్ని గడిపేందుకు చేయని నేరాన్ని తన మీద వేసుకుని ఓ యువకుడు జైల్లో పడే వేదనని ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించారు.  ఈ నేపథ్యంలో ఈ మూవీకి సీక్వెల్ గా ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

ఆకట్టుకుంటున్న సీక్వెల్ టీజర్

‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బి’ సినిమాను  నవంబర్ 17న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సినీ అభిమానులకు ఆకట్టుకుంటోంది. తొలి సినిమాలోని కథను ఎక్కడా మిస్ చేయకుండా ఈ సినిమాకు లింక్ పెట్టారు దర్శకుడు. తొలి సినిమాలోని టెంపోనూ ఇందులోనూ కంటిన్యూ చేశారు.  హీరో జైల్లో ఉన్న సీన్ తో స్టార్ట్ అయ్యి తన ప్రియురాలు చెప్పే మాటలను ట్రాన్సిస్టర్ లో వింటున్నట్లుగా చూపించారు. ఇక ఒకే టీజర్ లో తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ డైలాగులు పెట్టడం ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ కు చరణ్ రాజ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా చైత్ర  

ఇక ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా.. ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బి’ లో చైత్ర జే ఆచార్ కూడా హీరోయిన్‌గా కనిపించనుంది. పరమ్వాహ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చరణ్ రాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakshit Shetty (@rakshitshetty)

Read Also: ‘టైగర్ 3’లో టవల్ సీన్‌పై స్పందించిన హాలీవుడ్ నటి మిచెల్ లీ - ఆ సన్నివేశానికి అన్ని రోజులు పట్టిందా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సమంత కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget