Prem Kumar: వరుడు చింత పిక్కల ‘ప్రేమ్ కుమార్’.. సునందగారి సింగిల్ పుత్రుడు, వధువు లేచిపోయిందట!

సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ప్రేమ్ కుమార్’ సినిమాకు సంబంధించిన ఓ ప్రోమో వీడియోను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది.

FOLLOW US: 

బాలనటుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి.. హీరోగా విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న సంతోష్ శోభన్ మరో చిత్రంతో వచ్చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘ఏక్ మినీ కథా’ సినిమాలో అడల్ట్ కామెడీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంతోష్ చేతి నిండా ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. తాజా అతడు నటించిన ‘ప్రేమ్ కుమార్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇందులో సంతోష్ ఫన్నీ క్యారెక్టర్‌లో మళ్లీ మెప్పించేందుకు సిద్ధమైపోతున్నాడు. 

చిత్రయూనిట్ బుధవారం ‘ప్రేమ్ కుమార్’ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను విడుల చేసింది. ‘‘సునందగారి సింగిల్ పుత్రుడు.. సుందరల లింగానికి సోలో స్నేహితుడు.. రోషన్‌గాడికి రంకు మొగుడు.. వరుడు చిరంజీవి చింత పిక్కల ప్రేమ్ కుమార్’’ అంటూ సంతోష్ శోభన్‌ను పరిచయం చేయడం వెరైటీగా ఉంది. చివరికి వధువును కూడా పరిచయం చేస్తారు. చివర్లో కమెడియన్ సుదర్శన్ ‘‘పెళ్లి కూతురు లేచిపోయింది’’ అంటూ ట్విస్ట్ ఇస్తాడు. ఓవరాల్‌గా ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది. కామెడీ, ఎంటర్‌టైన్మెంట్‌ను ఇష్టపడేవారికి తప్పకుండా నచ్చుతుందని అనిపిస్తోంది. 

Also Read: తెలుగులో ‘మనీ హీస్ట్’ పార్ట్-5: ప్రొఫెసర్ చనిపోతారా? తెరపైకి టోక్యో ఫ్లాష్‌బ్యాక్!

సంతోష్ సరసన రాశీ సింగ్ కథానాయికగా కనిపించనుంది. కృష్ణ చైతన్య, రుచిత సాదినేని, కృష్ణ తేజ, ప్రభావతి, హర్ష చెముడు, రాజ్ మాదిరాజు, అశోక్ కుమార్, మధు, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, సాయి శ్వేత, ఆకుల శివ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. శారంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. అనంత్ శ్రీకర్ సంగీతం అందిస్తున్నాడు. 

వీడియో:

సంతోష్ త్వరలో ‘ఆహా’ ఓటీటీలో ప్రసారం కానున్న ‘ద బేకర్ అండ్ బ్యూటీ’ వెబ్‌సీరిస్ ద్వారా విష్ణు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇజ్రాయెల్‌లో ప్రేక్షకాధరణ పొందిన ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ వెబ్ సీరిస్‌నే తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియా యార్లగడ్డ రీమేక్ చేస్తున్నారు. ఇందులో సంతోష్ శోభన్‌తోపాటు టీనా శిల్పారాజ్, విష్ణు ప్రియా, వెంకట్, ఝాన్సీ, శ్రీకాంత్ అయ్యంగార్, స్వేతా, సంగీత్ శోభన్ తదితరులు నటిస్తున్నారు. 

Also Read: ‘మణికే మాగే హితే’.. ఈ వైరల్ సాంగ్ పాడిన యొహానీ ఎవరో తెలుసా?

Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భిమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే..

Also Read: ఆడపిల్ల బయటకు వెళ్లాలంటే కావాల్సింది మగాడితోడు కాదు ధైర్యం..దుమ్ము దులిపేసిన ‘సీటీమార్’ ట్రైలర్

Also Read: మీకు అర్థమవుతోందా.. ‘శ్రీదేవి సోడా సెంటర్’ ప్రమోషన్లో ఆనంది అందుకే కనిపించలేదంట!

Also Read: ప్రశాంతంగా సెలవు తీసుకుని ఈ వెబ్ సిరీస్ చూడండి.. ఉద్యోగులకు ఓ ఐటీ కంపెనీ బంపరాఫర్..

Published at : 01 Sep 2021 01:02 PM (IST) Tags: Prem Kumar Movie Santosh Shoban Prem Kumar సంతోష్ శోభన్

సంబంధిత కథనాలు

Karthika Deepam జులై 5 ఎపిసోడ్:  జ్వాల(శౌర్య)కి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు హిమ పరిస్థితేంటి - సౌందర్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది!

Karthika Deepam జులై 5 ఎపిసోడ్: జ్వాల(శౌర్య)కి నిజం తెలిసిపోయింది, ఇప్పుడు హిమ పరిస్థితేంటి - సౌందర్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది!

Pavitra Lokesh: నరేష్ తో రూమర్స్ - సినిమా ఛాన్స్ లు పోగొట్టుకున్న పవిత్ర?

Pavitra Lokesh: నరేష్ తో రూమర్స్ - సినిమా ఛాన్స్ లు పోగొట్టుకున్న పవిత్ర?

Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!

Kalyan Ram: ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!

Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే!

Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే!

GodFather Movie First Look: 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ - ఓల్డ్ గెటప్ లో మెగాస్టార్ 

GodFather Movie First Look: 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ - ఓల్డ్ గెటప్ లో మెగాస్టార్ 

టాప్ స్టోరీస్

Smita Sabharwal Job Tips: నిరాశ చెందవద్దు, ప్రణాళికా ప్రకారం ప్రిపేర్ అవ్వాలి - ఉద్యోగార్థులకు స్మితా సబర్వాల్ సూచనలివే

Smita Sabharwal Job Tips: నిరాశ చెందవద్దు, ప్రణాళికా ప్రకారం ప్రిపేర్ అవ్వాలి - ఉద్యోగార్థులకు స్మితా సబర్వాల్ సూచనలివే

IND vs ENG, Day 4 Highlights: నాలుగో రోజు ఇంగ్లండ్‌దే - విజయానికి 119 పరుగులు!

IND vs ENG, Day 4 Highlights: నాలుగో రోజు ఇంగ్లండ్‌దే - విజయానికి 119 పరుగులు!

Hair Pulling Disorder: వెంట్రుకలు పీక్కుంటున్నారా? అది అలవాటు కాదు రోగం, ఆ రోగానికి కారణాలు ఇవే

Hair Pulling Disorder: వెంట్రుకలు పీక్కుంటున్నారా? అది అలవాటు కాదు రోగం, ఆ రోగానికి కారణాలు ఇవే

Rains in AP Telangana: నేటి నుంచి 48 గంటలపాటు వర్షాలు, ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్ - ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్

Rains in AP Telangana: నేటి నుంచి 48 గంటలపాటు వర్షాలు, ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్ -  ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్