Samantha Skiing: మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్ అన్నారంటూ కామెంట్!
సమంత మంచుకొండల్లో చిల్ అవుతోంది. స్విట్జర్లాండ్‌లో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్న సామ్.. స్కీయింగ్ చేస్తున్న వీడియో చూస్తే ఔరా అంటారు.
నటి సమంత షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్‌తో ఇటీవల స్విట్జర్లాండ్‌కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె మంచులో స్కీయింగ్ చేయడం నేర్చుకుంది. పసుపు రంగు బైకర్ జాకెట్.. తెల్ల రంగు బాటమ్‌తో అదిరిపోయే లుక్‌లో సమంతా ప్రత్యక్షమైంది. అంతేకాదు.. నేర్చుకున్న క్షణాల్లోనే స్కీయింగ్ చేసి చూపించింది. సమంత ఆ వీడియోను శుక్రవారం తన అభిమానులతో పంచుకుంది. ‘‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయని వారు చెప్పారు. నిజాలు మాట్లాడలేదు’’.. #Newbeginnings అనే క్యాప్షన్ ఇచ్చింది. అయితే, సమంత ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసిందో ఆమెకే తెలియాలి. సామ్‌ను అలా చూసి.. ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. మొత్తానికి ఒడిదుడుకులను మరిచిపోయి సమంత జాలీగా గడిపేస్తోందని అంటున్నారు.
తాజాగా సమంత మరో ఊహించని పని కూడా చేసింది. నాగ చైతన్యతో విడాకుల ప్రకటన పోస్టును డిలీట్ చేసి ఆశ్చర్యపరిచింది. గతేడాది అక్టోబర్ 2న చైతు-సమంత విడాకులు తీసుకుంటున్నట్లు అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరూ విడాకులు విషయం ప్రకటించి మూడు నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఈ విషయం హాట్ టాపిక్ గానే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ నుంచి సమంతా ఆ ప్రకటన తొలగించడంతో.. అభిమానులు ఆలోచనలో పడ్డారు. చైతుతో సమంత మళ్లీ కలవబోతుందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ చైతు ఇన్స్టాగ్రామ్ లో మాత్రం విడాకుల అనౌన్స్మెంట్ ఇంకా కనిపిస్తుంది. కాబట్టి సమంత పొరపాటున ఈ పోస్ట్ డిలీట్ చేసి ఉండవచ్చని లేదా ఎలాగో అందరికీ తెలిసిన విషయాన్ని ఇంకా ఇన్‌స్టాలో ఉంచడం ఎందుకనే ఉద్దేశంతోనే సమంతా దాన్ని డిలీట్ చేసి ఉండవచ్చని అనుకుంటున్నారు. సమంత స్కీయింగ్ చేస్తున్న వీడియోను ఇక్కడ చూడండి.
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సమంత 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె సరికొత్త పాత్రలో కనిపించబోతుంది. దీంతో పాటు శ్రీదేవి మూవీస్ లో ఓ సినిమా, అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఓకే చేసింది. బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. మరోపక్క నాగచైతన్య 'బంగార్రాజు' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందు వచ్చాడు. ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. ప్రస్తుతం ఈ హీరో 'థాంక్యూ' సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. బాలీవుడ్ లో 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నారు. అలానే ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు.
View this post on Instagram