Samantha: సమంతకు స్వల్ప అస్వస్థత.. ట్రీట్మెంట్ అనంతరం ఇంట్లోనే రెస్ట్..
నిన్న కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగొచ్చిన సమంత కొన్ని గంటల్లోనే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న సమంత.. ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. తన విడాకులు, 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్, నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూలు ఇలా పలు కారణాల వలన ఆమెకి సంబంధించిన ఏదొక వార్త వినిపిస్తూనే ఉంది. నిన్ననే ఈ బ్యూటీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం కడపకు వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా మాంగల్య షోరూంను ప్రారంభిస్తున్న సందర్భంగా సినీ నటి సమంతను గెస్ట్ గా ఇన్వైట్ చేశారు.
ఆమెని చూడడానికి అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానుల కేరింతల మధ్య షాపింగ్ మాల్ ను ప్రారంభించింది సమంత. నిన్న కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగొచ్చిన సమంత కొన్ని గంటల్లోనే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
తీవ్రమైన జలుబు, వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కి వెళ్లినట్లు సమాచారం. డాక్టర్ల సజెషన్ మేరకు.. మెడికేషన్ తీసుకుంటూ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడూ ఎంతో ఆరోగ్యంగా.. ఫిట్నెస్ తో ఉండే సమంత ఆరోగ్యం చెడిపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసిన సమంత రీసెంట్ గా 'యశోద' అనే సినిమాను మొదలుపెట్టింది. హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి వేసవికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు సమంత చేతిలో ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, ఓ బైలింగ్యువల్ సినిమాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేయనుందని సమాచారం.
Also Read:పుష్ప రాజ్.. 'స్పైడర్ మ్యాన్'ని బీట్ చేయగలడా..?
Also Read:సమంత ఐటెం సాంగ్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్..
Also Read:బన్నీతో సమంత 'నాటు' స్టెప్.. ఊరమాస్ ఉందే..
Also Read: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?
Also Read: ఇది కేవలం జెర్సీ మాత్రమే కాదు.. నాగచైతన్య ఎందుకు అలా అన్నాడంటే?
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూసి రామ్, భీమ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి