Samantha: పాటలోనే కాదు ప్రాక్టీసులోనూ సెగలే.. ‘ఊ అంటావా మావా’ ప్రాక్టీస్ వీడియో వచ్చేసింది!
పుష్ప సినిమాలో సూపర్ హిట్ అయిన ఊ అంటావా మావా సాంగ్ ప్రాక్టీస్ వీడియోను సమంత విడుదల చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ‘ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా..’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఆడియో పరంగానే కాకుండా.. వీడియో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమంత తన కెరీర్‌లో మొదటిసారి ఐటమ్ సాంగ్ చేయడంతో ఈ పాటపై అంచనాలు తారాస్థాయిని అందుకున్నాయి. వీడియో ఆ అంచనాలను అందుకుంది కూడా.
ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన ప్రాక్టీస్ వీడియోను సమంత తన యూట్యూబ్ వీడియోలో విడుదల చేసింది. 40 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో సమంత పడ్డ కష్టాన్ని చూడవచ్చు. డ్యాన్స్ మాస్టర్ తనను ఎంతగానో కష్టపెడుతున్నాడంటూ సరదా వ్యాఖ్యలు చేసింది.
ఇక విడుదలై 20 రోజులు దాటినా.. పుష్ప జోరు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ సినిమా హిందీ వెర్షన్ కలెక్షన్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. విడుదలైన మొదటి రోజు కంటే 16వ రోజు హిందీ వసూళ్లు రెండు రెట్లు ఎక్కువ ఉండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల మార్కును కూడా దాటిందని ట్రాకర్స్ అంటున్నారు.
2021 సంవత్సరానికి మనదేశంలో అత్యధికంగా కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే. సూర్యవంశీ, 83, అంతిమ్ వంటి బాలీవుడ్ స్టార్లు నటించిన సినిమా కంటే పుష్ప కలెక్షన్లు ఎక్కువగా ఉండటం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
And now I will always trust you @alluarjun 🙌🙇♀️ https://t.co/EQOGv6M10F
— Samantha (@Samanthaprabhu2) December 28, 2021
Also Read: దీపా నీ మంచితనం రోజురోజుకీ భరించలేనంత బరువుగా మారుతోందంటూ డాక్టర్ బాబు ఆవేదన.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
Also Read: వసుధార కోసం పోటాపోటీగా రిషి-గౌతమ్… అయోమయంలో జగతి-మహేంద్ర… గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్
Also Read: షణ్ముఖ్ తో బ్రేకప్.. లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి సునయన..