అన్వేషించండి
Advertisement
Samantha: సంపదకు సమంత ఇచ్చిన నిర్వచనం ఏంటంటే? దీపావళి ఎవరితో సెలెబ్రేట్ చేసుకున్నారంటే?
సమంత సంతోషానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. అదేంటో తెలుసా? ఈ దీపావళిని ఎవరితో జరుపుకొన్నారో తెలుసా? ఓ లుక్కేయండి!
సంతోషమే ఇప్పుడు ధనం...
మానసిక ప్రశాంతతే విజయం...
ఆరోగ్యంగా ఉండటమే సంపద...
దయతో ఉండటమే నిశ్చలతత్త్వం! - ఇదీ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో శుక్రవారం ఉదయం పోస్ట్ చేసిన కోట్ సారాంశం. అక్కినేని నాగ చైతన్యతో వైవాహిక బంధం నుంచి బయటకొచ్చిన తర్వాత సమంత మాటల్లో, సోషల్ మీడియాలో చేసే పోస్టుల్లో వేదాంతం ఎక్కువ ధ్వనిస్తోంది. ఇప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండటం ముఖ్యమని ఆమె చెబుతున్నారు.
సాధారణంగా పండగ సీజన్లలో, హాలిడే టూర్లలో ఫ్యామిలీ ఫొటోలు పోస్ట్ చేయడం సమంతకు అలవాటు. గతంలో నాగచైతన్య లేదంటే అక్కినేని ఫ్యామిలీతో దిగిన ఫొటోలు పోస్ట్ చేసేవారు. ఈసారి దీపావళికి తన ఫొటోలు, పెంపుడు జంతువులతో దిగిన ఫొటోలు పోస్ట్ చేసి... ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.
శిల్పారెడ్డి ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్ లో సమంత కూడా పాల్గొన్నారు. అలాగే, ఉపాసనతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో పోస్ట్ చేశారు. ఈ దీపావళిని హైదరాబాద్‌లో సెలెబ్రేట్ చేసుకున్నారు. సమంతతో దిగిన ఫొటోలను శిల్పారెడ్డి ఇన్‌స్టాగ్రామ్ స్టోరిల్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం సమంత భాగ్య నగరంలో ఉంటున్నారని మరోసారి స్పష్టం అయ్యింది.
సినిమాలకు వస్తే... 'శాకుంతలం' చిత్రీకరణ పూర్తి చేశాక, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న సమంత, త్వరలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించనున్న సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో హరి - హరీష్ దర్శకులుగా పరిచయం కానున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. దీంతో పాటు శంతనురుబన్ జ్ఞానశేఖరన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించే సినిమాలో రచయిత్రిగా కనిపించనున్నారు. ఆ చిత్రానికి ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మాతలు. ఆ సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది.
Also Read: ఇద్దరమ్మాయిలతో అఖిల్ రొమాన్స్.. వర్కవుట్ అవుతుందా..?
Also Read: అప్పటికే మా తాతయ్య మరణించారు! ఆయన ఉండి ఉంటే...
Also Read: అప్పటికే మా తాతయ్య మరణించారు! ఆయన ఉండి ఉంటే...
Also Read: ఎన్టీఆర్ కుడిచేతి వేలికి గాయం... సర్జరీ పూర్తి, ఇంట్లో విశ్రాంతి!
Also Read: కన్నీటి పర్యంతమైన సూర్య... దివంగత కథానాయకుడికి నివాళి
Also Read: హీరో రాజశేఖర్‌కు పితృ వియోగం... శనివారం చెన్నైలో అంత్యక్రియలు
Also Read: మెగా ఫ్యామిలీ to ఎన్టీఆర్.. సెలబ్రిటీల ఇంట దీపావళి సందడి చిత్రాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: కన్నీటి పర్యంతమైన సూర్య... దివంగత కథానాయకుడికి నివాళి
Also Read: హీరో రాజశేఖర్‌కు పితృ వియోగం... శనివారం చెన్నైలో అంత్యక్రియలు
Also Read: మెగా ఫ్యామిలీ to ఎన్టీఆర్.. సెలబ్రిటీల ఇంట దీపావళి సందడి చిత్రాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion