Puneeth Rajkumar: కన్నీటి పర్యంతమైన సూర్య... దివంగత కథానాయకుడికి నివాళి
హీరో సూర్య ఈ రోజు బెంగళూరు వెళ్లారు. దివంగత కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్‌కు నివాళులు అర్పించారు. సూర్య వెంట శివ రాజ్ కుమార్ ఉన్నారు.#PuneethRajkumar #Suriya
దివంగత కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్‌కు హీరో సూర్య శివకుమార్ ఈ రోజు (శుక్రవారం) నివాళులు అర్పించారు. ఉదయం చెన్నై నుంచి బెంగళూరు వెళ్లిన సూర్య, నేరుగా పునీత్ సమాధి వద్దకు చేరుకున్నారు. ఆయన్ను పునీత్ పెద్దన్నయ్య శివ రాజ్ కుమార్ రిసీవ్ చేసుకున్నారు. నివాళులు అర్పించే సమయంలో సూర్య కన్నీటి పర్యంతమయ్యారు.
• @Suriya_offl Na In Bangalore To Pay His Last Respect For @PuneethRajkumar 💔🙏#Suriya #PuneethRajkumar pic.twitter.com/bFS9Gc3DcZ
— Suriya Trends Kerala (@TrendsSuriyaKL) November 5, 2021
వెండితెరపై మాత్రమే కాదు... నిజ జీవితంలోనూ పునీత్ రాజ్ కుమార్ హీరోనే. పద్దినిమిది వందల మంది చిన్నారులను చదివిస్తున్నారు. ఇంకా ఎంతోమందికి చేయూతను అందిస్తూ సాయం చేస్తున్నారు. అందువల్ల, ఆయన మరణవార్త విని ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నారు. న్యూస్ చదువుతూ లైవ్ లో ఓ యాంకర్ కన్నీరు పెట్టుకుంది. సినిమా తారలు, సామాన్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. తన కళ్లను దానం చేయడం ద్వారా మరణం తర్వాత నలుగురికి చూపు ప్రసాదించిన గొప్ప మనిషి పునీత్. పునీత్ చదివిస్తున్న పద్దెనిమి వందల మంది చిన్నారుల చదువు బాధ్యతను హీరో విశాల్ తీసుకున్న సంగతి తెలిసిందే.
Also Read: ఆ పద్దెనిమిది వందల మందిని నేను చదివిస్తా.. పునీత్ కి మాటిచ్చిన విశాల్
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, శ్రీకాంత్, ఆలీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుగుతో పోలిస్తే.. తమిళ పరిశ్రమ నుంచి చాలా తక్కువ మంది ప్రముఖులు వెళ్లారు. నృత్య దర్శకుడు, దర్శకుడు ప్రభుదేవా, నటుడు శరత్ కుమార్ వంటి కొంతమంది మాత్రమే హాజరయ్యారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి జలాల సమస్య ఉండటంతో గైర్హాజరు అయినట్టు తెలుస్తోంది.
Also Read: హీరో రాజశేఖర్‌కు పితృ వియోగం... శనివారం చెన్నైలో అంత్యక్రియలు
Also Read: మెగా ఫ్యామిలీ to ఎన్టీఆర్.. సెలబ్రిటీల ఇంట దీపావళి సందడి చిత్రాలు
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా... ఇలాగైతే కష్టమే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి