NTR: ఎన్టీఆర్ కుడిచేతి వేలికి గాయం... సర్జరీ పూర్తి, ఇంట్లో విశ్రాంతి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు గాయమైంది. అభిమానులు, ప్రేక్షకులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సర్జరీ చేసిన వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు గాయమైన సంగతి కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే... అభిమానులు, ప్రేక్షకులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది చిన్న గాయమే. దీపావళి సందర్భంగా కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో దిగిన ఫొటోను ఎన్టీఆర్ బుధవారం విడుదల చేశారు. అందులో కుడిచేతి మణికట్టుకు కట్టుతో కనిపించారు. ఏమైందని ఆరా తీయగా... కుడిచేతి వేలికి ఫ్యాక్చర్ అయినట్టు తెలిసింది. కొన్ని రోజుల క్రితం గాయం కాగా, సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సర్జరీ కూడా చిన్నదే అని సమాచారం.
'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణలో యాక్షన్ దృశ్యాలు తెరకెక్కిస్తున్న సమయంలో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ గాయాల పాలైనట్టు వార్తలొచ్చాయి. అయితే, ఎన్టీఆర్‌కు అయిన గాయం 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణలోది కాదు. కొరటాల శివ దర్శకత్వంలో నటించబోయే సినిమా (NTR30) కోసం ఇంట్లోని జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న సమయంలో కుడిచేతి వెలికి చిన్న గాయమైందట. ఇది దీపావళికి వారం రోజుల ముందు అయిన గాయమే. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచించారట.
Also Read: యంగ్ టైగర్ కోసం సూపర్‌స్టార్... మహేష్‌తో ఎన్టీఆర్ షో క్లైమాక్స్!
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో ఆయన అడవి బిడ్డలా అదరగొట్టారని అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ చేశారు. కండలు తిరిగిన దేహంతో ప్రచార చిత్రాల్లో కనిపించారు. 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాలో సైతం ప్యాక్డ్ బాడీతో కనిపించారు. ఆ రెండు సినిమాలకు భిన్నమైన ఫిజిక్ తో కొరటాల శివ సినిమాలో కనిపిస్తారట. దాని కోసం వర్కవుట్స్ చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్'లో లుక్ కంటే స్లిమ్ అండ్ స్టయిలిష్ లుక్ లో కనిపిస్తారట. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.
Also Read: హీరో రాజశేఖర్‌కు పితృ వియోగం... శనివారం చెన్నైలో అంత్యక్రియలు
Also Read: మెగా ఫ్యామిలీ to ఎన్టీఆర్.. సెలబ్రిటీల ఇంట దీపావళి సందడి చిత్రాలు
Also Read: 'మంచి రోజులు వచ్చాయి' సమీక్ష: మంచి నవ్వులు వచ్చాయి! కానీ...
Also Read: 'పెద్దన్న' సమీక్ష: ఇదేంటన్నయ్యా... ఇలాగైతే కష్టమే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి