Samantha: సోషల్ మీడియా ఖాతాల్లో మళ్లీ పేరు మార్చుకున్న సమంత
టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది సమంత. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రెండవుతున్న పేరు ఆమెదే.
టాలీవుడ్ అందాల జంట సమంత-నాగచైతన్య తమ బంధానికి స్వస్తి పలికారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరికి పడడం లేదని, ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని, త్వరలో విడాకులు తీసుకుంటారని... ఇలా రోజుకో వార్త వచ్చింది. అసలు వీళ్లిద్దరి మధ్య చెడిందనే మొదటి వార్త లేదా అనుమానం ఎలా పుట్టిందో తెలుసా? సోషల్ మీడియాలో సమంత తన పేరును మార్చడం వల్ల. తన పేరు పక్కన అక్కినేని అన్న ఇంటి పేరును తొలగించి, ఎస్ అనే ఆంగ్ల అక్షరాన్ని మాత్రమే ఉంచింది. అప్పుడు మొదలైంది అభిమానుల్లో అనుమానం. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆ పుకార్లే చివరకు నిజమయ్యాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ సమంత పేరు మార్చింది.
Also read: సమంత- నాగ చైతన్య విడాకులు.. నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది సామ్. నిన్నటి వరకు ఆమె ఇన్ స్టా, ట్విట్టర్ ఖాతాల్లో ఎస్ అనే ఆంగ్ల అక్షరం మాత్రమే ఉండేది. ఇప్పుడు మళ్లీ ‘సమంత’ అని పేరును రాసుకుంది. శనివారమే సామ్ తన భర్తతో విడిపోయినట్టు ప్రకటించింది. ఆ మరుసటి రోజే అంటే ఆదివారమే తన పేరును మార్చింది. పెళ్లికి ముందు ‘సమంత రుత ప్రభు’ అని ఉండేది, చైని పెళ్లి చేసుకున్నాక సమంత అక్కినేనిగా మార్చుకుంది. ఆ బంధాన్ని అధికారికంగా తెంచుకోవడానికి ముందే ఆమె అక్కినేనిని తన పేరునుంచి తొలగించింది. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులగానే కొనసాగుతామని చెప్పుకొచ్చారు చై-సామ్.
ఇన్ స్టాలో చాలా యాక్టివ్ గా ఉండే సామ్, ఫేస్ బుక్ లో మాత్రం చురుగ్గా ఉండదు. అందుకేనేమో ఇంకా సామ్ ఫేస్ బుక్ ఖాతాలో సమంత అక్కినేనిగానే ఉంది ఆమె పేరు. మరిచిపోయి అలా వదిలేసి ఉంటుందని భావిస్తున్నారు అభిమానులు. ఏదైమైనా సామ్-చై విడిపోవడం వారి అభిమానులకు చాలా బాధను మిగిల్చింది.
Also read: 'మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు'.. సిద్ధార్థ్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించో..?
Also read: చైతూ-సామ్ లైఫ్‌లో అజ్ఞాత వ్యక్తి.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ ఆమె గురించేనా? అందుకే విడాకులా?
Also read: రొమ్ము క్యాన్సర్ వారసత్వంగా వస్తుందా? లక్షణాలేంటి? ఎలా చెక్ చేసుకోవాలి?
Also read: గర్భిణుల్లో హఠాత్తుగా వచ్చే డయాబెటిస్... జాగ్రత్త పడక తప్పదు