అన్వేషించండి
Advertisement
First Movie in Space: అంతరిక్షంలో సినిమా షూటింగ్.. విమర్శలను లెక్క చేయకుండా..
రష్యాకి చెందిన 'ది ఛాలెంజ్' అనే సినిమా షూటింగ్ కోసం ఆ చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ ఈరోజు అంతరిక్షానికి బయలుదేరి వెళ్లారు.
కొన్ని సినిమాల్లో అంతరిక్షం, వ్యోమగాములకు సంబంధించిన సన్నివేశాలను చూస్తుంటాం. నిజానికి వాటి కోసం ప్రత్యేకంగా సెట్స్ డిజైన్ చేయడమో.. లేక గ్రాఫిక్స్ రూపంలో చూపించడంతో చేస్తుంటారు దర్శకనిర్మాత. హాలీవుడ్ లో ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో కొన్ని వందల సినిమాలు, సిరీస్ లు వచ్చాయి. అన్ని చోట్లా గ్రాఫిక్స్ నే వాడారు. కానీ ఇప్పుడు ఓ చిత్ర దర్శకనిర్మాతలు తమ సినిమాను అంతరిక్షంలో చిత్రీకరించడానికి నేడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఐస్)కు బయల్దేరి వెళ్లారు.
Also Read:'ఆహా'లో బాలయ్య టాక్ షో.. నిజమెంత..?
రష్యాకి చెందిన 'ది ఛాలెంజ్' అనే సినిమా షూటింగ్ కోసం ఆ చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ ఈరోజు అంతరిక్షానికి బయలుదేరి వెళ్లారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన సోయుజ్ ఎంఎస్19 వ్యోమనౌకలో మరో వ్యోమగామి ఆంటన్ ష్కాప్లెరోవ్‌తో కలిసి ఐఎస్‌ఎస్ వెళ్లారు. అంతరిక్ష కేంద్రంలో ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ వ్యోమగామిని కాపాడేందుకు భూమి నుంచి ఓ డాక్టర్ ఐఎస్‌ఎస్‌కు వెళ్లే సీన్ ను చిత్రీకరించడానికి స్పేస్ కి వెళ్లారు. సినిమాలో ఈ ఎపిసోడ్ దాదాపు 35 నుంచి 40 నిమిషాల వరకు ఉంటుందట.
12 రోజుల పాటు వీరంతా స్పేస్ స్టేషన్ లోనే ఉండనున్నారు. ఆ తరువాత వీరిని మరో రష్యన్ కాస్మోనాట్ భూమి మీదికి తీసుకు వస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యోని నాలుగు నెలల పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది. సినిమాను ఇలా అంతరిక్షంలో చిత్రీకరించడంపై రష్యన్ మీడియాలో కొందరు తీవ్రంగా విమర్శించారు. కానీ వాటిని లెక్క చేయకుండా చిత్రబృందం తన నిర్ణయానికే కట్టుబడి ఉంది. షూటింగ్ అనుకున్నట్లుగా పూర్తయితే.. అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశం రష్యానే కానుంది.
Корабль #СоюзМС19 успешно выведен на орбиту 🚀
— РОСКОСМОС (@roscosmos) October 5, 2021
Космонавт @Anton_Astrey и участники космического полета — Юлия Пересильд и Клим Шипенко — направляются к Международной космической станции! Стыковка произойдет через 3 часа — в 15:12 мск. pic.twitter.com/CPcf6IRU3I
Also Read:జడకు రిబ్బన్.. రంగుల కళ్లద్దాలు.. ఆ హీరోయిన్ ని ఇమిటేట్ చేసిన శ్రీముఖి..
Also Read: 'ఆదిపురుష్' మాత్రమే కాదు మరో రామాయణం వస్తోంది..ఇది కూడా భారీ ప్రాజెక్టే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
వరంగల్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement