News
News
X

Ramayana Movie Update: 'ఆదిపురుష్' మాత్రమే కాదు మరో రామాయణం వస్తోంది..ఇది కూడా భారీ ప్రాజెక్టే...

రామయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న సినిమా అనగానే ప్రస్తుతం సెట్స్ మీదున్న ప్రభాస్-సైఫ్ 'ఆదిపురుష్' అని చెబుతారు. కానీ మరో రామాయణం తెరకెక్కేందుకు సిద్ధంగా ఉందని తెలుసా...

FOLLOW US: 
 
రామాయణ, మహాభారతం బ్యాక్ డ్రాప్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు రిసీవ్ చేసుకునేందుకు సిద్ధంగానే ఉంటారేమో. ఆ పురాణకథల్లో ఉన్న ప్రత్యేకతే అది. ఇప్పటికే ఎంతోమంది దర్శుకులు రామాయణాన్ని తెరకెక్కించారు. ఎన్నిసార్లు తెరపై చూసినా మళ్లీ కొత్తగానే కనిపిస్తాడు రామయ్య. అదే అందులో గొప్పతనం. అలాంటి రామాయణ ఇతివృత్తాన్ని తీసుకుని ప్రభాస్ హీరోగా 'ఆది పురుష్' సినిమా రూపొందుతోంది. ఓం రౌత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అయోధ్య, లంకా నగరం, కిష్కింధకు సంబంధించి భారీ సెట్లు వేశారు. పాన్ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో విడుదలకాబోతోంది 'ఆదిపురుష్'. ఇక సేమ్ బ్యాక్ డ్రాప్ తో మరో ప్రొడక్షన్ హౌస్ వారు 'రామాయణ' నిర్మించడానికి రంగంలోకి దిగుతుండటం విశేషం.

మధు మంతెన,  నమిత్ మల్హోత్ర,  అల్లు అరవింద్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్టు కొంతకాలం క్రితమే వార్తలు వచ్చాయి. అయితే కరోనా కారణంగా ఈ ప్రాజెక్టు లేట్ అయినా ఇప్పుడు పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇందులో రాముడిగా రణ్ బీర్ కపూర్ .. రావణుడిగా హృతిక్ రోషన్ నటిస్తున్నారు. రీసెంట్ గా వీళ్లిద్దరూ ఈ సినిమా నిర్మాతతో సమావేశం కావడంతో రామాయణ ప్రాజెక్ట్ ముందుకు కదలనుందని తెలుస్తోంది. దీపావళికి ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. సీతాదేవి పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే కథానాయికను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అయితే రణబీర్ రాముడు కావడంతో సీతగా అలియా భట్ ను తీసుకుంటే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం హృతిక్ రోషన్ 'విక్రమ్ వేద' రీమేక్ లో నటిస్తుండగా, రణబీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర' సినిమాతో బిజీగా ఉన్నాడు. వీరి ప్రాజెక్టులు పూర్తయ్యాక 'రామాయణ' సినిమాపై పూర్తి దృష్టి పెట్టనున్నారు. 

News Reels

మరి సేమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న  'ఆది పురుష్', 'రామాయణ' లో తెరపై అధ్భుతాలు సృష్టించేది ఏదనేది ఇప్పుడు హాట్ టాపిక్. పైగా రాముడిగా నటిస్తోన్న ప్రభాస్-రణబీర్, రావణుడిగా నటిస్తోన్న సైఫ్-హృతిక్ లో ఎవరు ఎవర్ని డామినేట్ చేస్తారు ప్రేక్షకుల నుంచి ఎవరికి ఎన్ని మార్కులు పడతాయో చూడాలి.

Also Read: ఆ మాటలు విని కన్నీళ్లు ఆగలేదు.. ఆయన ఎప్పటికీ నా స్నేహితుడే: మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు
Also Read: బాలీవుడ్ బాద్ షా కి అండగా అభిమానులు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న #WeStandWithSRK
Also Raed: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి... 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 05 Oct 2021 11:25 AM (IST) Tags: Hrithik Ranbir Ramayana Movie

సంబంధిత కథనాలు

Blurr Movie Review - 'బ్లర్' రివ్యూ : తాప్సీ సిస్టర్‌ను ఎవరైనా చంపారా? లేదంటే ఊహ మాత్రమేనా? మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

Blurr Movie Review - 'బ్లర్' రివ్యూ : తాప్సీ సిస్టర్‌ను ఎవరైనా చంపారా? లేదంటే ఊహ మాత్రమేనా? మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !