అన్వేషించండి
Advertisement
Balakrishna: 'ఆహా'లో బాలయ్య టాక్ షో.. నిజమెంత..?
బాలకృష్ణకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 'అఖండ' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. అలానే అనిల్ రావిపూడిని కూడా లైన్ లో పెట్టారు.
సినిమాలతో పాటు ఇప్పుడు ఓటీటీపై కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. చాలా మంది నటీనటులు ఇప్పటికే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లు, వెబ్ సిరీస్ లతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు బాలయ్య ఏకంగా ఓ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని సమాచారం. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 'ఆహా' యాప్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ యాప్ కోసం పలు షోలను ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే సమంత, మంచు లక్ష్మీ, రానా వంటి వారు 'ఆహా'లో కొన్ని షోలను హోస్ట్ చేశారు. తాజాగా బాలకృష్ణను రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ షోతో మొదటిసారిగా బాలయ్య హోస్టింగ్ చేయబోతున్నారు. టాలీవుడ్ తో పాటు ఇతర భాషలకు చెందిన సెలబ్రిటీలను ఈ షోలో బాలయ్య ఇంటర్వ్యూలు చేయబోతున్నారు. దీనికి బోయపాటి దర్శకత్వంలో వహిస్తారని అంటున్నారు.
ఇప్పటికే రెండు, మూడు ఎపిసోడ్ లు చిత్రీకరించారని టాలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ షో ద్వారా వచ్చే డబ్బుని ఛారిటీ కోసం ఖర్చు చేయాలని బాలయ్య నిర్ణయించుకున్నారట. అందుకే షోని హోస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది.
Also Raed: మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు, ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్న విలక్షణ నటుడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
పాలిటిక్స్
ఛాట్‌జీపీటీ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion