By: ABP Desam | Updated at : 05 Oct 2021 11:54 AM (IST)
Edited By: RamaLakshmibai
Prakash raj
మా ఎన్నికల వివాదం ముదురుతోంది. మంచు విష్ణు ప్యానెల్‌పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతోందని, 60మందితో పోస్టల్ బ్యాలెట్‌లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారంటూ ప్రకాశ్ రాజ్ శ్రీకాంత్, జీవితతో వెళ్లి ఎన్నికల సహాయ అధికారి నారాయణరావుకు ఫిర్యాదు చేశారు. వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి ఇక్కడ డబ్బులు కట్టారని, వారితో ఓటు వేయించుకునే కుట్ర చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మా ఎన్నకల్లో 60ఏళ్లు పైబడినవారే పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు అని, వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి డబ్బులు కట్టారని మండిపడ్డారు. మోహన్ బాబు కంపెనీలో మేనేజర్ 56మందికి సంబంధించి రూ. 28వేలు మోహన్ బాబు ఎలా కడతారని ప్రశ్నించారు. ఎన్నికలు జరుగుతున్న తీరుపై ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్‌లో కన్నీరు పెట్టుకున్నారు. కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్, శరత్‌బాబు తదితరుల పోస్టల్ బ్యాలెట్ డబ్బులు కూడా మంచు విష్ణు తరఫు వ్యక్తే కట్టారు. ఆగంతుకులతో ‘మా’ ఎన్నికలు నిర్వహిస్తామా?ఇలా గెలుస్తారా?మీ హామీలు చెప్పి గెలవరా? ఇంత దిగజారుతారా? ఈ విషయంపై పెద్దలు కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి’’ అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.
అక్టోబర్ 10 న జరగనున్న 'మా' ఎన్నికల్లో ప్రధాన పోటీ ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్యే ఉండనుంది.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబర్స్ :
అధ్యక్షుడు: ప్రకాశ్‌రాజ్, ట్రెజరర్ : నాగినీడు
జాయింట్ సెక్రటరీ: అనితా చౌదరి, ఉత్తేజ్
ఉపాధ్యక్షుడు: బెనర్జీ, హేమ
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్
జనరల్ సెక్రటరీ: జీవితా రాజశేఖర్
ఎగ్జిక్యూటివ్ మెంబర్లు: అనసూయ, అజయ్, భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవింద రావు, ఖయూమ్, కౌశిక్, ప్రగతి, రమణా రెడ్డి, శివా రెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, సుబ్బరాజు. డి, సురేష్ కొండేటి, తనీష్, టార్జాన్
మంచువిష్ణు ప్యానెల్ మెంబర్స్:
మంచు విష్ణు - అధ్యక్షుడు
రఘుబాబు - జనరల్ సెక్రటరీ
బాబు మోహన్ - ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
మాదాల రవి - వైస్ ప్రెసిడెంట్
పృథ్వీరాజ్ బాలిరెడ్డి - వైస్ ప్రెసిడెంట్
శివబాలాజీ - ట్రెజరర్క
రాటే కల్యాణి -జాయింట్ సెక్రటరీ
గౌతమ్ రాజు-జాయింట్ సెక్రటరీ
ఎగ్జిక్యూటివ్ మెంబర్లు: అర్చన, అశోక్ కుమార్, గీతాసింగ్, హరినాథ్ బాబు, జయవాణి, మలక్ పేట్ శైలజ, మాణిక్, పూజిత, రాజేశ్వరి రెడ్డి, రేఖా, సంపూర్ణేష్ బాబు, శశాంక్, శివనారాయణ, శ్రీలక్ష్మి, శ్రీనివాసులు, స్వర్ణ మాధురి, విష్ణు బొప్పన, వడ్లపట్ల ఎమ్ఆర్సి
Also Read: 'ఆదిపురుష్' మాత్రమే కాదు మరో రామాయణం వస్తోంది..ఇది కూడా భారీ ప్రాజెక్టే...
Also Read: బాలీవుడ్ బాద్ షా కి అండగా అభిమానులు, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న #WeStandWithSRK
Also Raed: విజయ దశమి ఎందుకు జరుపుకుంటారు.. శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో అనుగ్రహిస్తుంది ... ఆ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Nabha Natesh : నభా నటేష్ అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!
Hi Nanna : హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!
Trinayani Serial November 15th Today Episode గాయత్రీ పాపకు ప్రాణ గండం.. షాక్‌లో నయని కుటుంబం!
Sanjeev Reddy : సినీ, ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టాలీవుడ్ దర్శకుడు లేఖ
Nelson Dilipkumar: రజనీకాంత్‌ను అలా చూపించొద్దన్నారు, భయమేసినా వెనక్కి తగ్గలేదు: ‘జైలర్’ దర్శకుడు నెల్సన్
Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని పిలుపు
Vizag Tycoon Junction Politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !
What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా - వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది ?
Bandlagooda Private School: ప్రైవేట్ స్కూల్ అత్యుత్సాహం - అయ్యప్ప మాల ధరించిన బాలికను అనుమతించని యాజమాన్యం
/body>