By: ABP Desam | Updated at : 06 Dec 2021 04:19 PM (IST)
రామ్ చరణ్ ఫెరోషియస్ లుక్.. 'ఆర్ఆర్ఆర్' పోస్టర్ అదిరిందిగా..
'మా అన్న మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు' అంటూ ఏడాది క్రితం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రామ్ చరణ్ పాత్రను పరిచయం చేసింది 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం. అలానే సినిమాలో రామ్ చరణ్ లుక్ ను రివీల్ చేస్తూ పలు పోస్టర్స్ ను విడుదల చేశారు. అందులో ఒక పోస్టర్ లో రామ్ చరణ్ తన కండలు తిరిగిన దేహంతో, కాషాయ వస్త్రాలు ధరించి విల్లుని ఎక్కిపెట్టి కనిపించాడు. మరికొన్ని పోస్టర్స్ లో పోలీస్ యూనిఫామ్ లో కనిపించాడు. తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ నెల 9న సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తుండడంతో హీరోలుగా నటిస్తోన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పోస్టర్ లను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ పోస్టర్ ను వదలగా.. ఇప్పుడు రామ్ చరణ్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో చరణ్ ఎంతో ఫెరోషియస్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్.. పలు కామెంట్స్ తో రామ్ చరణ్ ని తెగ పొగిడేస్తున్నారు.
రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే మూడు పాటలను విడుదల చేశారు.అందులో 'నాటు నాటు' పాటలో హీరోలు ఇద్దరు వేసిన స్టెప్పులకు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. 'జనని...' సాంగ్ సినిమాలో ఎమోషన్ ఎలివేట్ చేసింది. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత.
That’s RAM for you… #RRRTrailer #RRRMovie #RRRTrailerin3Days pic.twitter.com/qlf1OsG8wc
— Ram Charan (@AlwaysRamCharan) December 6, 2021
Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: హీరోయిన్‌కు రంగు తెచ్చిన సమస్య... దాన్నుంచి బయట పడటం కోసం!
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: బాలయ్యతో ఆ సాయంత్రం అన్ స్టాపబుల్ అంటున్న ప్రిన్స్ మహేష్... ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
Also Read: ఉపాసన చెల్లెలి పెళ్లికి తరలి వెళ్లిన మెగా కుటుంబం... దోమకొండలో భారీబందోబస్తు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?
Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?
Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?
IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక