Naatu Naatu Video Song: 'ఆర్ఆర్ఆర్'లో నాటు నాటు వీడియో సాంగ్ వచ్చేసింది
'ఆర్ఆర్ఆర్' సినిమాలో 'నాటు నాటు' సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ సాంగ్ లో ఎన్టీఆర్, చరణ్ ల డాన్స్ కి అభిమానులు ఫిదా అయిపోయారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది. ఈ వారంలో పెద్ద సినిమాలు రిలీజ్ ఉండడంతో 'ఆర్ఆర్ఆర్' హవాకి బ్రేక్ పడే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో 'నాటు నాటు' సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ సాంగ్ లో ఎన్టీఆర్, చరణ్ ల డాన్స్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సాంగ్ వైరల్ అయింది. ఎన్టీఆర్, చరణ్ ల డాన్స్ ను అనుకరిస్తూ కొన్ని లక్షల రీల్స్ చేశారు. ఇప్పుడు ఈ పాటను యూట్యూబ్ లో విడుదల చేశారు.
పూర్తి వీడియో సాంగ్ ను కాసేపటి క్రితమే విడుదల చేసింది చిత్రబృందం. అప్పుడే ఈ పాటకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఒక్కరోజులో మిలియన్స్ ను దాటేయడం ఖాయం. చంద్రబోస్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు.
Also Read: ఎయిర్‌పోర్టులో నటికి వేధింపులు - అసభ్యంగా తాకుతూ!
View this post on Instagram