RRR: ఎన్టీఆర్ కోసం స్పెషల్ బైక్, ఎంత ఖర్చు పెట్టారంటే?
'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం గుర్రం, బైక్ లను వాడారు. రామ్ చరణ్ గుర్రం మీద వెళితే.. ఎన్టీఆర్ బైక్ పై వెళ్తూ కనిపించారు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్ గా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ అన్నీ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. తన సినిమా మేకింగ్ విషయంలో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
'ఆర్ఆర్ఆర్' కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం గుర్రం, బైక్ లను వాడారు. రామ్ చరణ్ గుర్రం మీద వెళితే.. ఎన్టీఆర్ బైక్ పై వెళ్తూ కనిపించారు. అయితే ఈ బుల్లెట్ కోసం చాలానే ఖర్చు పెట్టారట. ఈ ఒక్క బైక్ కోసమే రాజమౌళి చాలా రీసెర్చ్ చేశారట. బుల్లెట్ కంపెనీ పేరు వెలో సెట్ మోటార్ బైక్. బ్రిటన్ కు చెందిన ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ బర్మింగ్ హమ్ లో ఉంది.
సినిమాలో ఎన్టీఆర్ ఉపయోగించిన బైక్ 1920 తరువాత చెందిన ఎమ్ సిరీస్ మోడల్ లా కనిపిస్తుంది. ఇక వెలో సెట్ మోటార్ బైక్ కంపెనీ 1920 నుంచి 1950 వరకు అంతర్జాతీయ మోటార్ రేసింగ్ విభాగంలో టాప్ ప్లేస్ లో ఉండేది. ఆ తరువాత 1970లలో ఈ కంపెనీ బైక్ లను తయారు చేయడం మానేసింది. 'ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్ కి బైక్ కావాలనుకున్నప్పుడు రాజమౌళి అప్పట్లో బైక్స్ ఉత్పత్తి చేయడంలో ఎవరు టాప్, ఎలాంటి మోడల్స్ చేసేవారని పరిశీలించి.. ఇప్పుడున్న మోటార్ బైక్ ని తనకు కావాల్సినట్లుగా అప్పటి మోడల్ లో కనిపించేలా దాదాపు రూ.10 లక్షలు ఖర్చు పెట్టి మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

