News
News
వీడియోలు ఆటలు
X

Rashmika Mandanna: ఇంట్లో పని మనుషుల పాదాలకు నమస్కరిస్తా - రష్మిక

తన కుటుంబ సభ్యులను కలగవగానే వారి పాదాలకు నమస్కరిస్తానని చెప్పింది రష్మిక మందన్న. తన ఇంట్లో పని వారి పాదాలను కూడా మొక్కుతానని వెల్లడించింది. అందరినీ ఒకేలా గౌరవిస్తానని చెప్పుకొచ్చింది.

FOLLOW US: 
Share:

సినిమా షూటింగ్స్ నుంచి ఇంటికి చేరుకోగానే తాను పెద్దల పాదాలకు నమస్కారం చేయడం తనకు అలవాటు అని స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తెలిపింది. తన ఇంట్లో పని వారికి కూడా అంతే గౌరవంగా నమస్కారం చేస్తానని చెప్పుకొచ్చింది. ఎదుటి వారికి గౌరవం ఇవ్వడంలో తనకు భేదాలు ఉండవని వెల్లడించింది.  అందరినీ సమానంగా చూడటమే తనకు ఇష్టమని చెప్పింది.  .

ఇంటికి వెళ్లగానే వారి పాదాలకు నమస్కరిస్తా- రష్మిక

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక పలు కీలక విషయాలు వెల్లడించింది. “నేను చిన్న చిన్న విషయాలను కూడా చాలా గొప్పగా ఫీలవుతాను. నా పెంపుడు జంతువులతో గడపడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎవరైనా చెప్పే మంచి మాటలను శ్రద్ధగా వింటాను. నా డైరీలో వాటి గురించి రాసుకుంటాను. షూటింగ్స్ నుంచి ఇంటికి రాగానే, నేను ప్రతి ఒక్కరి పాదాలకు నమస్కరిస్తాను. ఇంట్లో పని మనుషులకు కూడా గౌరవంగా నమస్కరిస్తాను. పెద్దలంటే నాకు గౌరవం. డబ్బు, హోదాలను నేను పట్టించుకోను. నేను ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాను” అని చెప్పుకొచ్చింది.

నన్ను చూసి పేరెంట్స్ గర్వపడాలి- రష్మిక

తన తల్లిదండ్రుల గురించి కూడా ఆమె గొప్పగా చెప్పుకొచ్చారు. తన పేరెంట్స్ పట్ల ఎంతో గర్వంగా ఉంటుందని చెప్పింది.  “నా కుటుంబం సినిమా పరిశ్రమ గురించి పెద్దగా పట్టించుకోదు. నేను ఇండస్ట్రీలో ఎలా రాణిస్తున్నానో వారికి పెద్దగా తెలియదు. కానీ, అవార్డులు గెలుచుకున్నప్పుడు వారు గర్వంగా ఫీలవుతారు. వారు నా గురించి ఇంకా గర్వపడేలా చేయాలని భావిస్తున్నాను. అందుకోసం నేను ఇంకా శ్రమించాల్సి ఉంది. నా తల్లింద్రులు నన్ను చిన్పప్పుడు ఏ చీకుచింతా లేకుండా పెంచారు. నా ప్రతి కోరిక వాళ్లు తీర్చారు. వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇప్పుడు వారిని జాగ్రత్తగా చూసుకోవడం నా వంతు” అని రష్మిక వివరించింది. రష్మిక గౌరవం పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు.   

రష్మిక చివరిగా శంతను బాగ్చి దర్శకత్వం వహించిన ‘మిషన్ మజ్ను’లో కనిపించింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, పర్మీత్ సేథీ, షరీబ్ హష్మీ, కుముద్ మిశ్రా, రజిత్ కపూర్ నటించారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప: ది రూల్‌’లో నటిస్తోంది.  అటు రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్‌ తో కలిసి  సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ అనే సినిమా చేస్తోంది. ఈ చిత్రం ఆగస్ట్ 11 న విడుదల కానుంది. అంతేగాక రష్మిక తెలుగులో నితిన్‌తో మరోసారి జంటగా నటించనున్నారు. 'ఛలో' దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి రెండో సినిమా చేస్తున్నారు. ఉగాది సందర్భంగా సినిమా అనౌన్స్ చేశారు. 

Also Read : సైంధవుడిగా మారుతున్న వెంకటేష్ - రెగ్యులర్ షూటింగుకు రెడీ, ఎప్పట్నించి అంటే?

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

Read Also: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సాంగ్ - మూడేళ్ల తర్వాత స్క్రీన్‌పై కనిపించిన అనుష్క, ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

Published at : 23 Mar 2023 10:39 AM (IST) Tags: Rashmika Mandanna Rashmika Mandanna Movies Rashmika Mandanna respect

సంబంధిత కథనాలు

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

టాప్ స్టోరీస్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు

Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో  కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు