Ranveer Singh: 'భాయ్ కా స్టైల్ దేఖో' - చెప్పులేసుకున్న విజయ్ దేవరకొండని ఆడేసుకున్నాడుగా!
ముంబైలో జరిగిన 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రణవీర్ సింగ్ గెస్ట్ గా వచ్చారు.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు తెలుగులోనే సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ కావడానికి రెడీ అవుతున్నారు. అతడు నటించిన 'లైగర్' సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ లాంటి దర్శకనిర్మాత ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ కావడంతో విపరీతమైన బజ్ వస్తోంది.
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. దీనికోసం హైదరాబాద్, ముంబైలలో గ్రాండ్ ఈవెంట్స్ ను నిర్వహించారు. ముంబైలో జరిగిన ఈవెంట్ కి రణవీర్ సింగ్ గెస్ట్ గా వచ్చారు. ఎప్పటిలానే తన స్టైలిష్ గెటప్ తో ఆకట్టుకున్నారు రణవీర్. అయితే ఇదే ఈవెంట్ కి చాలా సింపుల్ గా వచ్చిన విజయ్ దేవరకొండని ఆడేసుకున్నారు రణవీర్.
సింపుల్ గా టీషర్ట్, కార్గో ప్యాంట్.. సాధారణ చెప్పులు వేసుకొని కనిపించారు విజయ్ దేవరకొండ. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి విజయ్ చెప్పులేసుకొని రావడం చూసిన రణవీర్ కొన్ని కామెంట్స్ చేశారు. 'భాయ్ కా స్టైల్ దేఖో.. అతడి ట్రైలర్ లాంచ్ కి నేను వచ్చానా..? లేక నా ట్రైలర్ లాంచ్ కి అతడు వచ్చాడా..? అనేది తెలియడం లేదు' అనగానే విజయ్ తెగ సిగ్గుపడిపోయారు. అక్కడున్న వారంతా రణవీర్ మాటలకు నవ్వుకున్నారు.
జాన్ అబ్రహం తరువాత ఇలా చెప్పులేసుకొని స్వాగ్ చూపిస్తున్న పర్సన్ విజయే అంటూ చెప్పుకొచ్చారు రణవీర్. అలానే విజయ్ టీషర్ట్ బాగుందని.. ఇప్పుడే నాకు ఇచ్చేయ్ అని అడిగారు రణవీర్. కాసేపటికి విజయ్ టీషర్ట్ రణవీర్ వేసుకొని కనిపించారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
View this post on Instagram
View this post on Instagram