Samantha - Naga Chaitanya: నాగ చైతన్య, సమంతను ఒక గదిలో పెడితే కత్తులు దూరంగా ఉంచాల్సిందేనా?
Samantha Opens Up About Present Relationship With Naga Chaitanya In Koffee With Karan Season 7: ఇప్పుడు అక్కినేని నాగ చైతన్యకు, తనకు మధ్య సంబంధాలు అంత బాలేదని సమంత స్పష్టం చేశారు.
![Samantha - Naga Chaitanya: నాగ చైతన్య, సమంతను ఒక గదిలో పెడితే కత్తులు దూరంగా ఉంచాల్సిందేనా? Samantha Corrects Karan Johar When He Talks Akkineni Naga Chaitanya As Her Husband, She immediately Corrects Ex Husband refers to Chay In Koffee With Karan Show Samantha - Naga Chaitanya: నాగ చైతన్య, సమంతను ఒక గదిలో పెడితే కత్తులు దూరంగా ఉంచాల్సిందేనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/b978e1940daedc0f991aecfbe12088781658452575_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'కాఫీ విత్ కరణ్' సీజన్ 7లో మూడో ఎపిసోడ్‌లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్‌తో పాటు సమంత అతిథిగా సందడి చేశారు. అందులో విడాకులు, విడాకుల తర్వాత పరిస్థితి, ముఖ్యంగా ట్రోలింగ్ వంటి అంశాల గురించి మాట్లాడారు. మనసులో ఏది దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్టు సూటిగా, స్పష్టంగా మాట్లాడారు.
'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) ను భర్త అని కరణ్ జోహార్ అంటుండగా... మరో ఆలోచన లేకుండా, అసలు ఏమాత్రం తడుముకోకుండా ''మాజీ భర్త'' అని సమంత (Samantha) కరెక్ట్ చేశారు.
ఇప్పుడు చైతూ, సమంత మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? - ఈ విషయం తెలుసుకోవాలని చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న. ఇదీ కరణ్ జోహార్ అడిగారు. ''ఒకవేళ మా ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచారనుకోండి... మీరు షార్ప్ ఆబ్జెక్ట్స్ (కత్తులు వంటివి) దాచేయాలి. ప్రస్తుతానికి అయితే అంతే! మా మధ్య అంత స్నేహపూర్వక సంబంధాలు లేవు. భవిష్యత్తులో, కొన్నాళ్ల తర్వాత అయితే పరిస్థితి స్నేహపూర్వకంగా ఉంటుందేమో'' అని సమంత చెప్పారు.
Also Read : ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో మెగాహీరో - నిజమేనా?
తాను 250 కోట్ల భరణం తీసుకున్నానని, ఆ తర్వాత పెళ్ళికి ముందు అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల భరణం రాలేదని ఏవేవో రాస్తున్నారని, తన గురించి చదివిన గాసిప్స్‌లో చెత్త అదేనని సమంత అన్నారు. ఆన్ లైన్ ట్రోలింగ్ గురించి కూడా ఆమె మాట్లాడారు. ట్రోలింగ్ గురించి తానేమీ కంప్లైంట్ చేయడం లేదని, చైతూతో విడిపోయినప్పుడు అప్ సెట్ అవ్వలేదని, ఆ సమయంలో సమాధానాలు చెప్పడం తన బాధ్యతగా భావించానని సమంత అన్నారు.
Also Read : సౌత్, నార్త్ కాదు మేం ఇండియన్ యాక్టర్స్ - ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)