News
News
X

NTR30: ఎన్టీఆర్,కొరటాల శివ సినిమాలో మెగాహీరో - నిజమేనా?

ఎన్టీఆర్30 సినిమాలో హీరో బావమరిది క్యారెక్టర్ ఒకటి ఉంటుందట. దానికోసం మెగాహీరోని తీసుకోవాలనుకుంటున్నారు.

FOLLOW US: 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు ఎన్టీఆర్. రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన చిన్న వీడియోను వదిలారు. అదొక రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నిజానికి ఈపాటికే సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది కానీ ఆలస్యమవుతుంది. 

ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందంటున్నారు కానీ ఈ విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఫైనల్ స్క్రిప్ట్ ను లాక్ చేసే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఓ మెగాహీరో గెస్ట్ రోల్ లో కనిపిస్తాడట. 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మరో మెగాహీరోతో కలిసి నటించబోతున్నారట. 

కథ ప్రకారం.. సినిమాలో ఎన్టీఆర్ బావమరిది క్యారెక్టర్ ఒకటి ఉంటుందట. దాని నిడివి తక్కువే అయినప్పటికీ.. ఆ రోల్ లో పేరున్న నటుడిని తీసుకోవాలనుకుంటున్నారు. దీనికోసం సాయి తేజ్ ని సంప్రదించినట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజముందో దర్శకుడు కొరటాల క్లారిటీ ఇస్తారేమో చూడాలి. 

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు అలియాభట్ ను అనుకున్నారు కానీ ఆమె కొన్ని కారణాల వలన నో చెప్పింది. అప్పటినుంచి హీరోయిన్స్ కోసం చాలా ఆప్షన్స్ చూస్తున్నారు కానీ ఏదీ వర్కవుట్ కావడం లేదు. ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన హీరోయిన్స్ ను మళ్లీ రిపీట్ చేయడం కొరటాలకు ఇష్టం లేదు. టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ ను రంగంలోకి దింపాలనుకుంటున్నారు. బాలీవుడ్ అమ్మాయిని తీసుకుంటే పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్ కి పనికొస్తుందని ఆలోచిస్తున్నారు.

Also Read :అంచనాలు ఆకాశాన్ని అందుకునేలా చేసిన పూరి - విజయ్ దేవరకొండ 'లైగర్' ట్రైలర్ వచ్చేసింది

Also Read : 'పరంపర 2' రివ్యూ: ఫస్ట్ సీజన్ కంటే లెంగ్త్ తక్కువ - జగపతి బాబు, నవీన్ చంద్ర, శరత్ కుమార్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

View this post on Instagram
 
A post shared by Jr NTR (@jrntr)

Published at : 21 Jul 2022 08:46 PM (IST) Tags: ntr Koratala siva NTR30 Sai Tej

సంబంధిత కథనాలు

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

టాప్ స్టోరీస్

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల