By: ABP Desam | Updated at : 21 Jul 2022 09:45 AM (IST)
'లైగర్'లో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం వహించిన పాన్ ఇండియా సినిమా 'లైగర్'. సాలా క్రాస్ బ్రీడ్... అనేది ఉప శీర్షిక. ఈ రోజు తెలుగు ట్రైలర్‌ను ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి, ఫేస్‌బుక్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Watch Liger Trailer Here), హిందీ ట్రైలర్ రణ్‌వీర్, మలయాళం ట్రైలర్ దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం... ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్‌లో ఏముంది? అనే విషయానికి వస్తే... 'ఒక లయన్‌కి, టైగర్‌కి పుట్టి ఉంటాడు. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ' అని రమ్యకృష్ణ చెప్పే డైలాగుతో మొదలైంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండను పూరి జగన్నాథ్ మాసీగా, అదే సమయంలో స్టైలిష్ గా చూపించారు. నేపథ్యంలో వచ్చే సంగీతం బావుంది. విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి.
లవ్, యాక్షన్, మదర్ రోల్, మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్... ట్రైలర్‌లో పూరి జగన్నాథ్ అన్నీ చూపించారు. విజయ్ దేవరకొండకు నత్తి ఉందనే విషయాన్ని కూడా రివీల్ చేశారు. క్యారెక్టర్స్ అన్నీ చూపించారు. కాకపోతే... కథ గురించి క్లూ ఇవ్వలేదు. 'అయామ్ ఫైటర్' అని విజయ్ దేవరకొండ అంటే... 'నువ్వు ఫైటర్ అయితే నేను ఏంటి?' అని మైక్ టైసన్ ట్రైలర్ చివర్లో చెప్పడం బావుంది.
''పూరి జగన్నాథ్ మళ్ళీ ఆకట్టుకున్నాడు. అంచనాలను ఆకాశాన్ని అందుకునేలా చేశాడు... లైగర్ ట్రైలర్ వచ్చేసింది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
Also Read : కనిపించినంత గ్లామర్‌గా ఉండదు - కుమార్తెలను పరిచయం చేస్తూ విష్ణు మంచు ఎమోషనల్ లెటర్
విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
Also Read : 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ ఫైట్ - వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత
And here goes the #Liger Trailer
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 21, 2022
Puri Strikes Again!
Raising expectations sky high..
All The Very Best to Entire Team!https://t.co/Te4M9zmdyF@TheDeverakonda @ananyapandayy @MikeTyson @karanjohar #PuriJagannadh @Charmmeofficial @apoorvamehta18 @iamVishuReddy @RonitBoseRoy pic.twitter.com/U37aLtOjY2
SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు
Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్
Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా
Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?
Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక
Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !
Asia Cup, India's Predicted 11: పాక్ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్ అంచనా నిజమవుతుందా?
OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!
Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!