By: ABP Desam | Updated at : 20 Jul 2022 02:47 PM (IST)
అరియనా, వివియానా, విష్ణు మంచు
''ఒక నటుడి ప్రయాణం కనిపించినంత గ్లామర్‌గా ఉండదు'' అని విష్ణు మంచు అన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని, అనుక్షణం నలువైపుల నుంచి వచ్చే అభిప్రాయాలతో డీల్ చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. తన కుమార్తెలు అరియనా (Ariaana), వివియనా (Viviana) గాయనీమణులుగా, నటీమణులుగా పరిచయం కానున్న నేపథ్యంలో విష్ణు మంచు ఒక ఎమోషనల్ లెటర్ రాశారు.
విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా' (Ginna Movie). ఇందులో ఫ్రెండ్షిప్ సాంగ్‌ను అరియనా, వివియానా ఆలపించారు. ఈ ఆదివారం ఉదయం ఆ పాటను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల ఆశీర్వాదం కోరుతూ విష్ణు మంచు ఒక లేఖ రాశారు.
విష్ణు మంచు రాసిన లేఖ (Vishnu Manchu Letter To Audience):
ఈ సినిమాలో స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), రేణుకగా సన్నీ లియోన్ (Sunny Leone) నటిస్తున్నారు. ఇందులోని పాటలకు ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Also Read : నందమూరి కళ్యాణ్ 'బింబిసార' చూసిన 'దిల్' రాజు
కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు (Mohan Babu) ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు. దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి మూల కథ అందించగా... కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఆయనే క్రియేటివ్ ప్రొడ్యూసర్. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. 'వెన్నెల' కిశోర్, 'చమ్మక్' చంద్ర, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు.
Also Read : 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ ఫైట్ - వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత
Salaar: ప్రభాస్ 'సలార్'లో టాలెంటెడ్ యాక్టర్స్ - పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్!
Tollywood: 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ గ్యారెంటీ - ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ అరెస్ట్!
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!
Thalapathy Vijay: మహేష్ బాబు థియేటర్ లో విజయ్ - ఏం సినిమా చూశారో తెలుసా?
Shakini-Dhakini: ‘శాకిని డాకిని’ రిలీజ్ డేట్ ఫిక్స్, యాక్షన్ కామెడీతో వస్తున్న రెజినా, నివేదా థామస్
సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?
Milk Price : పాల ప్యాకెట్ల కోసం బడ్జెట్ పెంచుకోవాల్సిందే - మళ్లీ రేట్లు పెంచేసిన కంపెనీలు ! ఇవిగో కొత్త ధరలు