RRR VFX Breakdown: 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ ఫైట్ - వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత
'ఆర్ఆర్ఆర్' సినిమాలో పెద్ద పులితో ఎన్టీఆర్ ఫైటింగ్ సీన్ చాలా మంది ప్రేక్షకులకు ఫేవరెట్. ఆ ఫైట్ ఎలా తీశారో తెలుసా? వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత ఎలా ఉందో చూడండి.
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr) ఇంట్రడక్షన్ సీన్ గుర్తు ఉందా? అడవిలో పెద్ద పులితో ఫైట్ చేస్తారు. చాలా మందికి ఆ ఫైట్ ఫేవరెట్. థియేటర్లలో చూస్తున్నప్పుడు ఎంతో మందికి గూస్ బంప్స్ వచ్చాయి. అసలు, ఆ ఫైట్ ఎలా తీశారో తెలుసా?
పులితో ఫైట్ అంటే... షూటింగ్ చేసేటప్పుడు నిజంగా పులితో ఫైట్ చేయరు. వీఎఫ్ఎక్స్‌లో పులిని క్రియేట్ చేస్తారు. కళ్ళ ముందు పులి లేనప్పుడు ఆ పులిని తీసుకు రావడం ఎలా? పులిని ఊహించుకుని ఎన్టీఆర్ ఎలా ఫైట్ చేశారు? మనకి తెలియాలంటే... విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ శ్రీనివాస మోహన్ పోస్ట్ చేసిన వీడియో చూడాలి.
వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత... పులితో ఎన్టీఆర్ ఫైట్ విజువల్ ఎఫెక్ట్స్ బ్రేక్ చేస్తూ ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు. ఒక మనిషికి పూర్తిగా బ్లూ కవర్ వేసి, ఎన్టీఆర్ ఫైట్ చేశారు. తర్వాత బ్లూ కవర్ ప్లేసులో పులిని రీప్లేస్ చేశారన్నమాట. అదీ సంగతి!
Also Read : డైరెక్టుగా ఓటీటీలోకి 'బబ్లీ బౌన్సర్' - తమన్నా ఫస్ట్ లుక్ చూశారా?
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' థియేటర్లలో ఘన విజయం సాధించింది. వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. ఓటీటీలో విడుదలైన తర్వాత హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకుంటోంది.
Also Read : అది పాస్తా వల్ల వచ్చిన కడుపు, ప్రెగ్నన్సీ కాదు - రూమర్లకు చెక్ పెట్టిన కరీనా కపూర్
View this post on Instagram