News
News
వీడియోలు ఆటలు
X

రానా భార్య ప్రెగ్నెంట్? ఎట్టకేలకు స్పందించిన మిహికా బజాజ్

'లీడర్' హీరో రానా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలపై రానా భార్య 'మిహికా బజాజ్' క్లారిటీ ఇచ్చారు. అలాంటి శుభవార్త ఏమైనా ఉంటే తప్పకుండా షేర్ చేసుకుంటానని స్పష్టం చేశారు.

FOLLOW US: 
Share:

Mihika Bajaj : టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గత కొన్ని రోజుల క్రితం రానా భార్య మిహికా బజాజ్ కాస్త బొద్దుగా కావడంతో.. అది చూసిన నెటిజన్లు ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు అల్లేశారు. ఈ తరహా వార్తలపై మిహికా బజాజ్ తాజాగా స్పందించారు. అలా పుట్టుకొచ్చే వార్తలను ఆమె కుండ బద్దలు కొట్టినట్టు కొట్టిపారేశారు.

సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో రానా.. 'లీడర్' తో అరంగేట్రం చేశారు. విసువల్ ఎఫెక్ట్స్ సమన్వయకర్తగా సుమారు 70 సినిమాలకు పని చేసిన ఆయన.. 2010లో నటుడిగా కెరీర్ ప్రారంభించారు. అలా 'నేను నా రాక్షసి', 'నా ఇష్టం', 'కృష్ణం వందే జగద్గురుం', 'రుద్రమదేవి', 'బాహుబలి', 'భీమ్లానాయక్'.. లాంటి చిత్రాల్లో నటించి మంచి పేరు, పాపులారిటీ తెచ్చుకున్నారు. 2017లో 'బాహుబలి 2'లో ప్రదర్శించిన అసాధారణ ప్రతిభకు గానూ.. రానాకు ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో 'ఫిల్మ్ ఫేర్ అవార్డు' లభించింది. ఇదే సంవత్సరంలో ఇదే సినిమాకు  ఉత్తమ ప్రతి నాయకుడు కేటగిరీలో సైమా అవార్డును కూడా రానా అందుకున్నారు. అంతకుముందు 2015లో బాహుబలి పార్ట్ 1లో నటనకు గానూ ఆయనకు ఉత్తమ ప్రతి నాయకుడు కేటగిరీలో సైమా అవార్డును సొంతం చేసుకున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా పలు షోల్లో యాంకర్ గా చేసి మంచి మాటకారిగా పేరు సంపాదించుకున్నారు. 

ఇక ఆయన వైవాహిక జీవితానికొస్తే.. రానా తన ప్రేయసి, మిహికా బజాజ్‌తో మే 21, 2020 న నిశ్చితార్థం, ఆగస్టు 8న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోతారని ప్రచారం కూడా సాగింది. సమంత, చైతూ కపుల్స్ మాదిరిగానే రానా, మిహికా కపుల్ విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలకు రానా కొద్ది రోజుల్లోనే ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ తర్వాత మళ్లీ కొన్నాళ్లకు రానా షేర్ చేసిన ఓ వీడియోతో దగ్గుబాటి ఫ్యాన్స్.. మిహికా ప్రెగ్నెంట్ అని ఫిక్సయిపోయారు. ఈ వీడియోలో మిహికా బీచ్ ఒడ్డున లూజ్ డ్రెస్‌లో చిల్ అవుతోంది. అంతే కాదు ఆమె బేబీ బంప్‌తో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆమె కడుపుతో ఉన్నదన్న వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. ఇంకేముంది  త్వరలోనే రానా తండ్రి కాబోతున్నారంటూ తెగ ప్రచారం జరిగింది. ఓ పక్క వెంకటేష్ చిన్న కూతురు కూడా ప్రెగ్నెంట్ కావడంతో దగ్గుబాటి ఫ్యామిలీకి డబుల్ ధమాకా అంటూ కొన్ని వార్తా ఛానెళ్లు, వెబ్ సైట్లు వార్తలు కూడా రాసేశాయి. 

ఇంతకుముందు తాము తల్లిదండ్రులు కాబోతున్నామన్నది నిజమైతే తప్పకుండా చెప్తామని రానా క్లారిటీ ఇచ్చినప్పటికీ.. నెటిజన్లు మాత్రం రూమర్స్ నే ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో రానా భార్య మిహికా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. తాను బరువు పెరగడం వల్ల కాస్త బొద్దుగా కనిపిస్తున్నానని.. అంతే తప్ప తాను గర్భవతిని కానని తేల్చి చెప్పేశారు. అలాంటి సందర్బమే వస్తే తప్పకుండా పంచుకుంటానని స్పష్టం చేశారు. దీంతో రానా తండ్రి కాబోతున్నాడన్న వార్తలకు చెక్ పడినట్టయింది.

Also Read: సమంత హార్డ్ వర్కర్ - ఫోన్ పగలగొట్టాలనిపిస్తాది: నాగ చైతన్య

Published at : 08 May 2023 03:02 PM (IST) Tags: Rana Daggubati Pregnant Baahubali TOLLYWOOD Social Media Mihika Bajaj

సంబంధిత కథనాలు

అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడెలా నమ్మాలి : కమల్ హాసన్‌కు సింగర్ చిన్మయి కౌంటర్

అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడెలా నమ్మాలి : కమల్ హాసన్‌కు సింగర్ చిన్మయి కౌంటర్

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?

Balakrishna IQ Trailer : బాలకృష్ణ విడుదల చేసిన 'ఐక్యూ' ట్రైలర్‌ - అసలు కాన్సెప్ట్ ఏమిటంటే?

JioCinema: నెట్‌ఫ్లిక్స్, డిస్నీ‌ల బాటలో ‘జియో సినిమా’ - ఇక యూనివర్సల్ కంటెంట్‌‌తో పిచ్చెక్కించేస్తారట!

JioCinema: నెట్‌ఫ్లిక్స్, డిస్నీ‌ల బాటలో ‘జియో సినిమా’ - ఇక యూనివర్సల్ కంటెంట్‌‌తో పిచ్చెక్కించేస్తారట!

ముంబై షెడ్యూల్‌ కంప్లీట్ చేసుకున్న 'నాని 30'

ముంబై షెడ్యూల్‌ కంప్లీట్ చేసుకున్న 'నాని 30'

టాప్ స్టోరీస్

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం

Hyderabad News: హైదరాబాద్‌లోని ఓ పబ్‌ వైల్డ్ ఆలోచనపై విమర్శలు- అధికారులు, నెటిజన్లు ఆగ్రహం