By: Suresh Chelluboyina | Updated at : 08 May 2023 11:10 AM (IST)
Image Credit: Naga Chaitanya/Instagram
అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ మూవీ ఫ్లాప్ నేపథ్యంలో అందరి కళ్లు ఇప్పుడు నాగ చైతన్య ‘కస్టడీ’పై ఉన్నాయి. అయితే, ‘ఏజెంట్’తో పోల్చితే ‘కస్టడీ’కి కాస్త పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. మరోవైపు ‘కస్టడీ’ టీమ్ ప్రమోషన్స్ కూడా జోరుగానే చేస్తోంది. ఈ సందర్భంగా నాగ చైతన్య పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. అయితే, ప్రతి ఇంటర్వ్యూలో ఆయనకు సమంతతో విడాకుల గురించే ప్రశ్నలు ఎదురవ్వుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చైతుకు మరోసారి తన విడాకుల గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు చైతూ కాస్త అసహనం ప్రదర్శిస్తూనే.. చాలా కూల్‌గా సమాధానం చెప్పారు. అంతేకాదు, సమంత గురించి కూడా పాజిటివ్‌గా స్పందించారు. దీంతో చైతూను అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
తనకు వచ్చే కోపం గురించి నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘‘నాకు కోపం వస్తుంది. కానీ, అది ముఖంలో కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది. కోపం వచ్చేప్పుడు ఓ రెండు నిమిషాలు సెల్‌ఫోనో, ఏదో ఒక వస్తువో పగలగొట్టేయాలని అనిపిస్తుంది’’ అని తెలిపారు. ఇక సినిమాల్లో తండ్రి నాగార్జున స్టైల్‌ను అనుకరిస్తారా అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నా కంటూ ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరుచుకోవాలని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా కమర్షియల్ హంగులతో కూడిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేయాలని ఉంది’’ అని వెల్లడించారు.
సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై చైతన్య మాట్లాడుతూ.. ‘‘నా గురించి మాట్లాడినా ఏమీ అనుకోను. కానీ, అందులోకి నా కుంటుబాన్ని లాగితేనే నచ్చదు’’ అని పేర్కొన్నారు. ‘‘నా జీవితంలో పెళ్లి, విడాకులు అనేవి అనుకోకుండా జరిగిపోయినవే. అది ఇక గడిచిపోయింది. కానీ, హెడ్‌లైన్స్ కోసం ఇంకా దాన్ని సాగదీయడం అనేది తప్పు’’ అని చైతూ స్పష్టత ఇచ్చారు. ఇక తనతో నటించిన హీరోయిన్ల గురించి చెబుతూ.. పూజా హెగ్డే స్టైల్, కృతి శెట్టిలో ఇన్నోసెన్స్ నచ్చుతాయన్నారు. ఇక సాయిపల్లవితో డ్యాన్స్ అంటే ఆమె లేనప్పుడు రిహార్సల్స్ చేసేవాళ్లమన్నారు. సమంతా చాలా హర్డ్ వర్కర్ అని, ఏమైనా అనుకుంటే చేసి తీరుతుందని చైతూ వెల్లడించడం గమనార్హం.
ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో కూడా చైతన్య సమంతపై పాజిటీవ్‌గా స్పందించారు. “మేము విడిపోయి రెండు సంవత్సరాలు అయ్యింది. అధికారికంగా విడాకులు తీసుకుని ఏడాది పూర్తయ్యింది. విడాకుల తర్వాత మా ఇద్దరి జీవితాలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. ఇద్దరం వేరైనా ఆమెతో కలిసి ఉన్నని రోజులను చాల గౌరవంగానే చూస్తాను. నిజానికి సమంత లవ్లీ ఉమెన్. ఆమె అన్ని ఆనందాలకు అర్హురాలు. మీడియా ఊహాగానాల కారణంగానే మా మధ్య గొడవలు జరిగాయి. అవి పెద్దవయ్యాయి. చివరికి విడిపోవాల్సి వచ్చింది. వాస్తవానికి నేను మొదట్లో ఊహాగానాల గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ, ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ప్రజలు ఇప్పటికీ నా పెళ్లి గురించి అనేక విషయాలు చర్చించుకుంటున్నారు. ఏదేదో ఊహించుకుంటున్నారు. ప్రస్తుతం నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. జీవితం చాలా బాగుంది. జీవితంలో ప్రతి అంశం నేర్చుకోదగినదే. నేను నా గతం, నా వర్తమానం, భవిష్యత్తును సానుకూలతతో చూస్తాను. ఏది జరిగినా నా మంచికే అనుకుంటాను” అని చెప్పుకొచ్చారు.
సమంత గురించి ప్రశ్నలు ఎదురైన ప్రతిసారి నాగ చైతన్య పాజిటివ్‌గా స్పందించడంపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన విడాకుల విషయంలో చాలా హూందాగా స్పందింస్తున్నారని, కానీ ఆమె మాత్రం దాన్ని సింపథీ కార్డుగా వాడుకుంటోంది. సినిమా ప్రమోషన్ల కోసం విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తోందని అంటున్నారు. సామ్‌కు, చైతూకు మధ్య ఉన్న తేడా అదేనని, చైతన్య ఇప్పటికీ సమంత గురించి పాజిటివ్‌గానే ఉన్నాడని అంటున్నారు.
Read Also: నేను చేసిన ఆ పిచ్చి పనులన్నీ నా భార్య డైరీలో ఉంటాయి: దర్శకుడు మారుతి
NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?
Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!
Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?
Lavanya Tripathi Relationship : ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ లావణ్య పెట్టిన క్యాప్షన్ వెనుక ఇంత కథ ఉందా?
Lavanya Tripathi: అల్లు అరవింద్ మాటలను నిజం చేసిన లావణ్య, వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో!
Telangana Poltics : తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?
Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం - దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !
Saroor Nagar Murder Case: పోలీసులనే భయపెట్టిన అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ- పరువు కోసం చంపేసినట్టు స్టేట్మెంట్
కాంగ్రెస్ సంచలన నిర్ణయం! స్కూల్ సిలబస్ నుంచి RSS వ్యవస్థాపకుడి పాఠం తొలగింపు?