By: ABP Desam | Updated at : 20 Dec 2022 02:23 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Upasana/Instagram
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవలె మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశారు. ఆ ఆంజనేయ స్వామి కృపతో త్వరలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు అంటూ ట్వీట్ చేశారాయన. ఈ ట్వీట్ తో మెగా అభిమానుల్లో సందడి మొదలైంది. మెగా వారసుడు వచ్చేస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా మెగా వారసుడి గురించి మరో ఇంట్రస్టింగ్ వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ ఫ్యామిలీ పార్టీ కోసం రామ్ చరణ్ దంపతులు ఇటీవల థాయ్ లాండ్ కు వెళ్లారు. అక్కడ ఫ్యామిలీ తో కలసి సరదాగా దిగిన కొన్ని ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఉపాపన బేబీ బంప్ తో కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
మెగా కోడలు ఉపాసన.. రామ్ చరణ్ భార్య గానే కాకుండా అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలిగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది ఉపాసన. హెల్త్, ఫిట్ నెస్ గురించి ఎన్నో ఆరోగ్య సూత్రాలు చెప్తూ ప్రజలకు చేరువైంది. రామ్ చరణ్-ఉపాసన ల వివాహం జూన్ 14, 2012న హైదరాబాద్ లో ఘనంగా ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఉపాసన అపోలో చారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తోంది. వీరి పెళ్లి అయి దాదాపు పదేళ్లు గడుస్తోంది. ఇప్పటి దాకా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పలేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ జంట పిల్లల్ని కంటున్నారనే వార్త తెలియడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
మొదట్లో వీరి సంతానం గురించి చాలా వార్తలు వచ్చాయి. వాటన్నిటిపై మెగా ప్యామిలీ ఎప్పుడూ స్పందించలేదు. ఇటీవల ఉపాసన ఓ ఇంటర్వ్యూలో ప్రెగ్నెన్సీ, పిల్లల పెంపకం పై కొన్ని వ్యాఖ్యలు చేసింది. జీవితంలో పిల్లల పెంపకం అనేది చాలా ముఖ్యమైనదని చెప్పింది. అది లైఫ్ లాంగ్ ప్రాజెక్టు అని 20 ఏళ్ల పాటు పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలని పేర్కొంది. అన్నేళ్లు తల్లిందండ్రులు తమ జీవితాలను పిల్లల కోసం త్యాగం చేయాలని అంది. పిల్లల్ని పెంచి పెద్ద చెయ్యడానికి శారీరకంగా మానసికంగా సిద్ధంగా ఉండాలని చెప్పింది. పిల్లల్ని కనడానికి సరైన సమయం ఉంటుందని, ఎలాంటి పొరపాట్లు చేయకుండా పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలని చెప్పుకొచ్చింది ఉపాసన. పిల్లల పెంపకంపై తనకున్న క్లారిటీని చూసి మెచ్చుకుంటూ కామెంట్లు చేశారు.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో ఫుల్ బిజీ గా ఉన్నారు. వరుస భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ వంటి పాన్ ఇండియా సినిమా తర్వాత స్టార్ డైరక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శంకర్-చరణ్ కాంబో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీని తర్వాత ‘ఉప్పెన’ సినిమా దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు చరణ్.
బుల్లితెరపై ఇక ‘ఆనందం’ హీరో ఆకాశ్ సందడి - సీరియల్స్‌లోకి ఎంట్రీ?
Pathaan Film: ‘పఠాన్’ చూసేందుకు బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చిన ఫ్యామిలీ, షారుఖ్ పై అభిమానం అలాంటిది మరి!
K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం !
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !
TSPSC Group 4: 'గ్రూప్-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!