Ram Charan Speech: తారక్ చనిపోయేవరకు నా మనసులో ఉంటాడు.. చెన్నై ఈవెంట్‌లో చరణ్ ఎమోషనల్ స్పీచ్!
చెన్నైలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడారు.
జూనియర్ ఎన్టీఆర్ చనిపోయే వరకు తన మనసులో ఉంటాడని, థ్యాంక్స్ చెప్పి తనను దూరం చేసుకోలేనని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. చెన్నైలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శివకార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్, ఆర్బీ చౌదరి, కలైపులి ఎస్.థాను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘లైకా ప్రొడక్షన్స్‌తో ఎప్పటినుంచో పనిచేయాలనుకున్నాను. ఆర్ఆర్ఆర్‌తో అది సాధ్యం అయింది. రాజమౌళి గారిని హెడ్మాస్టర్ అనాలా.. ప్రిన్సిపల్ అనాలా.. గైడ్ అనాలా.. నాకు ఇండస్ట్రీలో మొదటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనాలా.. తెలియట్లేదు. రాజమౌళి గురించి మాట్లాడాలంటే ఒక స్టేజ్ సరిపోదు. నాకు ఎన్టీఆర్ లాంటి సోదరుడిని ఇచ్చినందుకు రాజమౌళికి ఎంతో థ్యాంక్స్.’
‘నేను, తారక్ తమిళంలో డబ్బింగ్ చెప్పాలని రాజమౌళి పట్టుబట్టారు. నాకు చాలా భయం వేసింది. వేరే భాషలో మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు మాట్లాడితే ఏమైనా అనుకుంటారేమో అని నా భయం. కానీ మదన్ కార్కీ వల్ల డబ్బింగ్ సులభం అయింది. ఆయన ఒప్పుకుంటేనే ఆరోజు డబ్బింగ్ పూర్తయ్యేది.’
‘శివ కార్తికేయన్, విజయ్, అజిత్ వంటి సూపర్ స్టార్ల తరహాలో నేను తమిళంలో మాట్లాడలేను. ఇక్కడికి వచ్చినందుకు ఉదయనిధి స్టాలిన్‌కు థ్యాంక్స్. తారక్‌కి, నాకు వయసులో ఒక్క సంవత్సరం మాత్రమే తేడా. కానీ తన మెంటాలిటీ పిల్లల తరహాలోనూ, పర్సనాలిటీ సింహం లాగానూ ఉంటుంది. తారక్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.’
‘నేను అందరికీ థ్యాంక్స్ చెప్తాను. కానీ తారక్‌కు మాత్రం థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. ఇటువంటి సోదరుడిని ఇచ్చినందుకు ఆయనకే థ్యాంక్స్ చెప్పాలి. ఎన్టీఆర్‌కు థ్యాంక్స్ చెప్తే ఈ రిలేషన్ ఇక్కడే ముగిసిపోతుందేమో అని భయంగా ఉంది. తారక్ చనిపోయే వరకు నా మనసులో ఉంటాడు.’ అని రామ్ చరణ్ అన్నారు.
ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
Catch our "RAM" aka Mega Power Star @AlwaysRamCharan Speaking Live at #RRRPreReleaseEvent - Chennai 🤩
— Shreyas Group (@shreyasgroup) December 27, 2021
▶️ https://t.co/l4ruaHu8J1#RRRMovie #RoarOfRRRinChennai @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @LycaProductions @ACTFibernet @shreyasgroup pic.twitter.com/79hHHcEX1z
Also Read: బాలకృష్ణ వీక్‌నెస్ మీద కొట్టిన రాజమౌళి
Also Read: రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్!
Also Read: దక్షిణాది భాషల్లో... రాజమౌళి సమర్పించు!
Also Read: రాజమౌళి మాట్లాడారు! సరే కానీ... హీరోలు అందుకు రెడీగా ఉన్నారా?
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి