Rajesh Khanna Birth Anniversary: రక్తంతో ప్రేమ లేఖలు, కారుపై లిప్ స్టిక్ ముద్దులు.. ఆ సూపర్ స్టార్ రేంజే వేరప్పా..
బాలీవుడ్ తొలి సూపర్ స్టార్.. రొమాన్స్‌కి సరికొత్త అర్థం చెప్పిన హీరో .. కంటిచూపుతో అమ్మాయిల మనసు దోచిన రాకుమారుడు రాజేష్ ఖన్నా జయంతి సందర్భంగా ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ..
బాలీవుడ్‌ని దశాబ్దంపాటు తన సినిమాలతో శాసించిన హీరో..వరుసగా 15 సూపర్ హిట్లు సొంతం చేసుకున్న రాజేష్ ఖన్నా 1942 డిసెంబర్ 29న అమృత్‌సర్‌లో జన్మించాడు. అసలు పేరు జతిన్ ఖన్నా. చిన్నప్పటి నుంచే స్టేజ్ షోలు, అవార్డులు రాజేష్ ఖన్నా సొంతం.1967లో “ఆఖ్రీ ఖత్’ రాజేష్ ఖన్నా మొదటి సినిమా అయినా... 1969లో రిలీజైన ఆరాధనతోనే ఖన్నా పాపులారిటీ పెరిగింది. అప్పటి నుంచీ వరుసగా 15 సూపర్ హిట్స్ అందుకున్న హీరో ఇప్పటివరకూ లేడనే చెప్పాలి. రాజేష్ ఖన్నా, షర్మిళాఠాగూర్ పెయిర్ ఆ తర్వాత చాలా సినిమాల్లోనూ కొనసాగింది .
సూపర్ స్టార్ బిరుదు ఇప్పుడు చాలామంది హీరోలకు ఇంటిపేరుగా మారింది కానీ అసలు ఇండియన్ సినిమాలో సూపర్ స్టార్ అనే బిరుదు పుట్టిందీ, పెరిగిందీ రాజేష్ ఖన్నా స్టార్ డమ్ తోనే అనిచెప్పాలి. బాలీవుడ్ ఫస్ట్ ఎవర్ సూపర్ స్టార్ టైటిల్ అందుకున్న మొదటి కథానాయకుడు రాజేష్ ఖన్నా. డైలాగ్స్ చెప్పే విధానం, మేనరిజం, డ్రెస్సింగ్ స్టైల్ అప్పట్లో ఓ ట్రెండ్. 70ల్లో ఆయన వరుస విజయాలతో ఫేస్ ఆఫ్ బాలీవుడ్ అయ్యాడు.తక్కువ రోజుల్లో ఎక్కువకాలం గుర్తుండే సినిమాలుచేసి విభిన్న పాత్రలతో స్టార్‌డమ్ ఎంజాయ్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో రాజేష్ ఖన్నా.
బాలీవుడ్‌ని రాజేష్ ఖన్నా ఏలిన కాలాన్ని మేజిక్ పీరియెడ్‌గా అభివర్ణిస్తారు. 1970ల్లో సినిమా రిలీజ్ అవుతుందంటే .. అందులో రాజేష్ ఖన్నా ఉన్నాడంటే చాలు .. సినిమా సూపర్ హిట్ అని ఫిక్సయ్యేవారు. అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచే రాజేష్ ఖన్నా కారుపై లిప్‌స్టిక్ తో అద్దిన ముద్దులెన్నో. ఇంకొందరు ఖన్నా ఫోటో నెత్తిన పెట్టుకుని సింధూరం ధరించి పెళ్లైపోయిందని చెప్పుకునేవారట. రక్తంతో రాసిన ప్రేమలేఖలతో ఇంటిముందున్న పోస్ట్ బాక్స్ నిండిపోయేదని చెబుతారు. ఇక షూటింగ్ అని తెలిస్తే చాలు అభిమాన ప్రవాహాన్ని అడ్డుకోవటడం సాధ్యంకాని విషయంగా మారేది.
తెలుగు ప్రేమనగర్లో అక్కినేని పాత్రను హిందీలో రాజేశ్ ఖన్నా చేసి దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించాడు. ముద్దుబిడ్డ రీమేక్‌లోనూ ఖన్నానే హీరో. ప్రేమ కథా చిత్రాల్లో రొమాంటిక్‌హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రొడ్యూసర్ గా మూడు, కో-ప్రొడ్యూసర్‌గా మరో మూడు సినిమాలు తీశాడు. తనకన్నా 15ఏళ్లు చిన్నదైన డింపుల్ కపాడియాపై మనసు పారేసుకున్న రాజేష్ ఖన్నా...''బాబీ'' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఆ టీనేజ్ అమ్మాయి 1973లో శ్రీమతి రాజేష్ ఖన్నాగా మారింది. ఆ రోజుల్లో తమ హీరోని తన్నుకుపోయిన విలన్ గా డింపుల్‌ని తిట్టిపోయని కాలేజీ అమ్మాయిలు లేరు. కుళ్లుకోని హిందీ హీరోయిన్ లేదంట. అది రాజేష్ ఖన్నా మ్యాజిక్. వీరికి ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా ఇద్దరు పిల్లలు. తల ఓ పక్కకు తిప్పిచూసి.. కనుబొమ్మలు ఎగరేసి నవ్వే రూపం ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికీ అలాగే ఉండిపోయింది.
Also Read: కార్తీక్ గురించి సౌందర్యకి మరో అప్ డేట్ ఇచ్చిన రత్నసీత.. రిస్క్ చేసేందుకు సిద్ధమైన డాక్టర్ బాబు, కార్తీకదీపం డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
Also Read: గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చే