Raj Kundra: శిల్పాశెట్టితో విడాకులు- రాజ్ కుంద్రా పోస్టు వెనుక ఉద్దేశం అదేనా?
నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు సంచలనం కలిగిస్తోంది. “మేం విడిపోయాం. ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు సమయం ఇవ్వండి” అని చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా విడిపోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, తాజాగా సోషల్ మీడియా వేదికగా రాజ్ కుంద్రా పెట్టిన పోస్టు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. “మేము విడిపోయాం. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి” అని సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు. ఈ పోస్టుకు బ్రోకెన్ హార్ట్ ఎమోజీని యాడ్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది . రాజ్ కుంద్రా శిల్పాశెట్టితో విడాకులు తీసుకుంటున్నారా? అని నెటిజన్లు జోరుగా చర్చలు జరుపుతున్నారు. శిల్పాశెట్టి అభిమానులు సైతం రాజ్ కుంద్రా పెట్టిన పోస్టుపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎందుకు ఇలా పోస్టు పెట్టారని ఆరా తీస్తున్నారు. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి బాగానే ఉన్నారు కదా? ఎందుకు ఇలాంటి పోస్టు పెట్టాల్సి వచ్చింది? ఆయన పోస్టు వెనుక ఉద్దేశం ఏంటి? అని ఆరా తీస్తున్నారు.
We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔
— Raj Kundra (@onlyrajkundra) October 19, 2023
రాజ్ కుంద్ర పోస్టు శిల్పాతో విడాకుల గురించేనా?
రాజ్ కుంద్రా చేసిన పోస్టులో శిల్పాశెట్టితో విడిపోతున్నట్లు సూటిగా చెప్పలేదు. ఆమె పేరును కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. శిల్పాతో గొడవ అయినట్లు కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. నిజంగా రాజ్ కుంద్రా విడిపోయేది శిల్పాతోనేనా? ఇంకేదైనా విషయంలోనా? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. అటు శిల్పా శెట్టి మాత్రం ఈ విషయానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. రాజ్ కుంద్రా పోస్ట్ మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై అభిమానులు, నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. రాజ్ కుంద్రా కొన్ని నెలలుగా ముఖానికి మాస్క్ వేసుకుని బయట తిరుగుతున్నారు. గుమ్మం దాటి బయటకు వస్తే చాలు ముఖానికి మాస్క్ పెట్టుకుంటున్నారు.
‘UT69’ జిమ్మిక్కు అంటున్న నెటిజన్లు
వాస్తవానికి రాజ్ కుంద్రా 2022లో పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయ్యారు. దాదాపు 2 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. ఆ తర్వాత బయటకు వచ్చిన రాజ్, అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా బయట మాస్క్ పెట్టుకునే ఉంటున్నారు. మరోవైపు రాజ్ కుంద్రా జీవితం ఆధారంగా ‘UT69’ అనే మూవీ వస్తోంది. ఈ సినిమాను షానవాజ్ అలీ దర్శకత్వం వహిస్తుండగా SVS స్టూడియోస్ నిర్మిస్తున్నది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లోనే రాజ్ కుంద్రా తన మాస్క్ తీసి కనిపించారు. దీంతో మాస్క్‌కు ఇక గుడ్ బాయ్ చెప్పే ఉద్దేశంలోనే రాజ్ కుంద్రా అలాంటి ప్రకటన చేసి ఉంటారని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
View this post on Instagram
Read Also: ‘సప్త సాగరాలు దాటి’ సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial