అన్వేషించండి

Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల

రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’. ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో తెలుగులో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

ఒకప్పుడు సినిమాలు ఒకటి లేదంటే రెండు భాషల్లో విడుదలయ్యేవి. కానీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రోజుల్లో తెరకెక్కే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్​లోనే రూపొందుతోంది. ఇక తాజాగా కన్నడ నాట బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్న చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’. రక్షిత్ శెట్టి హీరోగా హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా కనిపించింది. 

బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’

‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’ సినిమా ముందుగా కన్నడలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యింది. ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు. టాలీవుడ్ లోనూ ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అందమైన జీవితాన్ని గడిపేందుకు చేయని నేరాన్ని తన మీద వేసుకుని ఓ యువకుడు జైల్లో పడే వేదనని ఈ సినిమాలో దర్శకుడు అద్భుతంగా చూపించారు.  ఈ నేపథ్యంలో ఈ మూవీకి సీక్వెల్ గా ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

నవంబర్ 17న నాలుగు భాషల్లో విడుదల

వాస్తవానికి ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బి’ సినిమాను అక్టోబర్ 20న విడుదల చేస్తామని మేకర్స్ ముందుగా ప్రకటించారు. అక్టోబర్ 20న కన్నడలో, అక్టోబర్ 27న తెలుగులో ఈ సినిమా వస్తుందని ఇండస్ట్రీలో టాక్ నడిచింది. కానీ, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 17న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో రక్షిత్ శెట్టి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.  

View this post on Instagram
 
A post shared by Rakshit Shetty (@rakshitshetty)

మరో హీరోయిన్ గా చైత్ర జే ఆచార్

ఇక ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా.. ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బి’ లో చైత్ర జే ఆచార్ కూడా హీరోయిన్‌గా కనిపించనుంది. పరమ్వాహ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చరణ్ రాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Read Also: నిన్న ‘కేరళ స్టోరీ’, నేడు ‘న‌క్స‌ల్స్ స్టోరీ’- మరో సంచలన ప్రాజెక్టులో నటిస్తున్న అదా శ‌ర్మ‌

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Lava Blaze Duo 5G: రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
Perni Nani: ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
Embed widget