అన్వేషించండి

Naatu Naatu at Oscars 2023: అందుకే చెర్రీ, తారక్ ఆస్కార్ వేదికపై డ్యాన్స్ చేయలేదు - అసలు విషయం చెప్పిన ప్రొడ్యూసర్

ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటకు ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్స్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, చివరకు ఎలాంటి ప్రదర్శన ఇవ్వలేదు. ఎందుకు ‘RRR’ హీరోలు డ్యాన్స్ చేయలేదో నిర్మాత రాజ్ కపూర్ వెల్లడించారు.

భారతీయులు ఎంతగానో ఎదురు చూసిన ఆస్కార్ వచ్చేసింది. ‘RRR’ నాటు నాటు.. పాటకు ప్రపంచ ప్రఖ్యాత సినీ అవార్డు మోకరిల్లింది. హాలీవుడ్ దిగ్గజ సినిమాల్లోని పాటలను వెనక్కి నెట్టి సగర్వంగా ఆస్కార్ ను అందుకుంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఊపు ఊపేస్తున్న ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వేదికపై హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తారని ముందు ప్రచారం జరిగింది. కానీ, చివరకు వారు ప్రదర్శనలో పాల్గొనలేదు. దీంతో అభిమానులు చాలా హర్ట్ అయ్యారు.

ఎందుకు డ్యాన్స్ చేయలేదంటే?

‘RRR’ హీరోలు ఆస్కార్ వేదికపై ఫర్మార్మెన్స్ ఎందుకు ఇవ్వలేదో తాజాగా నిర్మాత రాజ్ కపూర్ వెల్లడించారు. వారి స్థానంలో లాస్ ఏంజెల్స్ డ్యాన్సర్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. “ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ పాటను ప్రదర్శించే అరుదైన అవకాశం మన వారికి దక్కింది. ఆస్కార్ 2023 వేదికపై కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్‌ పాడుతుంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ చేయాల్సి ఉండేది. కానీ, పలు కారణాలతో వారు వెనక్కి తగ్గారు. వారి వ్యక్తిగత కారణాలు, ప్రాక్టీస్ కు సమయం లేకపోవడం సహా పలు కారణాలతో తప్పుకున్నారు. ఒరిజినల్ నంబర్‌ సాంగ్ కు సంబంధించి రెండు నెలల పాటు వర్క్‌ షాప్ చేశారు. ఆ తర్వాత రిహార్సల్ చేసి 15 రోజుల పాటు పాటను చిత్రీకరించారు.  కానీ, ఇక్కడ వారికి ప్రాక్టీస్ చేసే అవకాశం దొరకకపోవడంతో ‘నాటు నాటు’ ప్రదర్శనను  లాస్ ఏంజిల్స్‌ లో ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లతో రిహార్సల్ చేయించాం. సుమారు 18 గంటల పాటు వారి రిహార్సల్స్ కొనసాగాయి” అని వెల్లడించారు. న్యూఢిల్లీలో పుట్టి కెనడాలో పెరిగిన నిర్మాత రాజ్‌కపూర్‌కి చాలా సంవత్సరాలుగా అకాడమీ సంస్థతో అనుబంధం ఉంది. గాయకులు, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్‌ తో ‘నాటు నాటు’ ప్రత్యక్ష ప్రదర్శన కోసం అతను ‘RRR’ బృందంతో కలిసి పనిచేశారు.

ముందుగానే హింట్ ఇచ్చిన జూ. ఎన్టీఆర్

అటు ఎన్టీఆర్ కూడా ఆస్కార్ వేదికపై తమ ప్రదర్శన ఉండబోదని ముందుగానే వెల్లడించారు.  “ఆ ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ పాటను లైవ్‌లో చూడాలని ఆసక్తిగా ఉన్నాను. మేము ఆ పాటకు డ్యాన్స్‌ వేస్తామని కచ్చితంగా చెప్పలేను. నాకు, రామ్‌ చరణ్‌కు రిహార్సల్స్‌ చేసే సమయం లేదు. అందుకే మేము ఆస్కార్‌ వేదికపై డ్యాన్స్‌ చేయలేకపోతున్నాం. ఆ పాటను ఎప్పుడు విన్నా నా కాళ్లు డాన్స్‌ చేస్తూనే ఉంటాయి’’ అంటూ వేడుకకు ముందే ఆయన ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే ఈ వేదికపై చెర్రీ, జూనియర్ కాకుండా ప్రొఫెషనల్ డ్యాన్సర్ ప్రదర్శనలో పాల్గొన్నారు.  

ఆస్కార్స్ వేడుకలో ‘RRR’ టీమ్ సందడి

లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో ‘RRR’ టీమ్ సందడి చేసింది.  దర్శకుడు SS రాజమౌళి, అతని భార్య రమా రాజమౌళి, రామ్ చరణ్, అతడి భార్య ఉపాసన, Jr NTR, MM కీరవాణి, అతడి భార్య  శ్రీ వల్లి, గీత రచయిత చంద్రబోస్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, SS కార్తికేయ ఆస్కార్ 2023లో టీమ్ ‘RRR’కి ప్రాతినిధ్యం వహించారు.

Read Also: మీకు తెలుసా? చెర్రీ, ఉపాసన ఎక్కడకెళ్లినా చిన్న సైజు ఆలయాన్ని వెంట తీసుకెళ్తారట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget