Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ నోట 'రామ్' పాట
Ram Telugu Movie Song: రామ్ అంటే హీరో రామ్ కాదు, తెలుగులో 'రామ్' పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. దాని టైటిల్ 'ర్యాపిడ్ యాక్షన్ మిషన్'. అందులో ఓ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
Rahul Sipligunj song in Ram (Rapid Action Mission) movie: రాహుల్ సిప్లిగంజ్... తెలుగు చిత్రసీమకు ఆస్కార్ తీసుకు వచ్చిన 'నాటు నాటు...' గాయకులలో ఒకరు. ఆ పాట కంటే ముందు, తర్వాత ఎన్నో మంచి పాటలు, హిట్ పాటలు పాడారు. ఆ సింగర్ ఇప్పుడు కొత్త పాటతో మన ముందుకు వచ్చారు.
'రామ్'లో రాహుల్ సిప్లిగంజ్ పాట!
Ram Telugu Movie: రామ్... అంటే 'ర్యాపిడ్ యాక్షన్ మిషన్'. ఈ చిత్రాన్ని దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఓఎస్‌ఎం విజన్ నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ నంబర్ 1గా రూపొందిస్తోంది. దీపికాంజలి వడ్లమాని నిర్మాత. మిహి రామ్ వైనతేయ దర్శకుడు. సూర్య అయ్యల సోమయజుల కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన జోడీగా ధన్యా బాలకృష్ణ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో 'బ్రేవ్ హార్ట్స్' పాటను తాజాగా విడుదల చేశారు.
బ్రేవ్ హార్ట్స్... దేశభక్తి గీతం!
Brave Hearts lyrical video from RAM (Rapid Action Mission) out now: మన దేశం కోసం సైనికులు ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళను నివాళిగా 'బ్రేవ్ హార్ట్స్' గీతాన్ని రూపొందించినట్టు అర్థం అవుతోంది. ఆశ్రితా అయ్యంగార్ సంగీతం అందించిన ఈ పాటను రాము కుమార్ ఏఎస్కే రాశారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.
'ఈ మాతృభూమి మట్టిలో...
మీ నెత్తురెంత కలిసెనో!
మా ఊపిరి అయ్యే దారిలో...
మీ ఉసురులెన్ని మిగిలెనో!
నీ కళ్ళ ముందు రంగులే...
త్రివర్ణమయ్యి మారేనా!' అంటూ సాగిందీ గీతం!
Also Read: సలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?
'బ్రేవ్ హార్ట్స్' సాంగ్ విడుదల చేసిన సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ''వాస్తవ ఘటనలు, సంఘటనలను బేస్ చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. లేటెస్టుగా విడుదల చేసిన 'బ్రేవ్ హార్ట్స్' పాటకు సైతం మంచి స్పందన లభిస్తోంది. మా హీరో సూర్య అయ్యల సోమయజుల తొలి చిత్రమిది. అయితే... సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు ఆ మాట అసలు తెలియదు. అనుభవం ఉన్న హీరోలా ఆయన నటించారు'' అని చెప్పారు. దర్శకుడు మిహి రామ్ వైనతేయకు సైతం ఇది తొలి సినిమా అని, దేశభక్తి కథతో ఆయన తీస్తున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని హీరో చెప్పారు.
Also Read: 'సలార్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ - ప్రభాస్ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
సూర్య అయ్యల సోమయజుల, ధన్యా బాలకృష్ణ హేవ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, 'శుభలేఖ' సుధాకర్, రవి వర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ధారణ్ సుక్రి, సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్, నిర్మాత: దీపికాంజలి వడ్లమాని, కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: మిహి రామ్ వైనతేయ.
Also Read: ప్రభాస్ ముందు కొండంత టార్గెట్ - థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు వస్తే 'సలార్' హిట్?