Salaar OTT: 'సలార్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ - ప్రభాస్ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Salaar OTT platform locked: 'సలార్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. థియేటర్లలో తమ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరో 'సలార్' టీమ్ చెప్పేసింది.
Salaar OTT Platform: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. 'కెజియఫ్', 'కెజియఫ్ 2' తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహించిన చిత్రమిది. శుక్రవారం (డిసెంబర్ 22న) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. మరి, ఓటీటీ సంగతి ఏంటి? ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది? అంటే...
'సలార్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ @ నెట్‌ఫ్లిక్స్!
Netflix bags Salaar OTT rights: 'సలార్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేశారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఆ ఐదు భాషల్లోనూ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
'సలార్' థియేటర్లలో విడుదల అయ్యే వరకు ఓటీటీ పార్ట్నర్ ఎవరు? అనేది రివీల్ చేయలేదు. సిల్వర్ స్క్రీన్ మీద తమ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ నెట్‌ఫ్లిక్స్ అని అనౌన్స్ చేశారు. సుమారు 200 కోట్లకు అటు ఇటుగా డీల్ జరిగిందని టాక్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లలో విడుదలైన ఎన్ని వారాలకు ఈ సినిమా ఓటీటీలో వస్తుంది? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.
Also Read: సలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?
శాటిలైట్ రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారంటే...
Salaar movie satellite rights acquired by Star network: 'సలార్' శాటిలైట్ రైట్స్ ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ సంస్థ 'స్టార్' సొంతం చేసుకుంది. ఓటీటీలో సినిమా విడుదల అయిన తర్వాత బుల్లితెరపై టెలికాస్ట్ కానుంది.
Also Read: ప్రభాస్ ముందు కొండంత టార్గెట్ - థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు వస్తే 'సలార్' హిట్?
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్' సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటించారు. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించారు. ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు కనిపించారు. తెలుగు నటులు జగపతి బాబు, ఎంఎస్ చౌదరి, బ్రహ్మజీ, షఫీ, ఝాన్సీ, సప్తగిరి తదితరులతో పాటు 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, తమిళ సినిమాలతో పేరు తెచ్చుకున్న తెలుగు హీరో బాబీ సింహా, 'కెజియఫ్' విలన్ రామచంద్ర రాజు, తమిళ నటుడు జాన్ విజయ్ ఇతర పాత్రల్లో కనిపించారు.
Also Read: 'డంకీ' రివ్యూ: 'పఠాన్', 'జవాన్' తర్వాత 2023లో షారుఖ్ ఖాన్‌కు హ్యాట్రిక్ అవుతుందా? లేదా?
'సలార్' సినిమాకు ఆల్మోస్ట్ 'కెజియఫ్'కు వర్క్ చేసిన టీమ్ వర్క్ చేసింది. కెమెరా మ్యాన్ నుంచి ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్... అందరూ 'కెజియఫ్' బ్యాచ్! సినిమా చూస్తే... 'కెజియఫ్' ఫార్మటులో ఉంటుంది. లైటింగ్, మ్యూజిక్, యాక్షన్ సీన్స్ డిజైన్ అంతా 'కెజియఫ్'ను తలపిస్తుంది.