Radhika Apte: ఇండస్ట్రీలో హీరోయిన్లంతా అదే టైప్ - రాధికా ఆప్టే కామెంట్స్
రీసెంట్ గా ఓ నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన రాధికా ఆప్టే.. ఇండస్ట్రీ జనాలపై, హీరోయిన్లపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధికా ఆప్టే.. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. వైవిధ్యమైన పాత్రలను ఎన్నుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు చేయడం లేదు ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె తన భర్తతో కలిసి లండన్ లో ఉంటోంది. అక్కడ చాలా ప్రశాంతంగా ఉందని.. ఎలాంటి టెన్షన్స్ ఉండవని చెప్పుకొచ్చింది.
రీసెంట్ గా ఓ నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె.. ఇండస్ట్రీ జనాలపై, హీరోయిన్లపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరోయిన్లకు అందం అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. టాలెంట్ తో కొంతమంది రాణిస్తున్నప్పటికీ.. మన తారలు మాత్రం గ్లామరస్ గా కనిపించడానికి ఇష్టపడతారు. తమను తాము పెర్ఫెక్ట్ గా మార్చుకోవడం కోసం కొన్ని సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ఆ మాటకొస్తే.. హీరోల్లో సైతం అందం కోసం సర్జరీ చేయించుకున్నవారు ఉన్నారు.
అలాంటి వారిపై షాకింగ్ కామెంట్స్ చేసింది రాధికా. ఇండస్ట్రీలో తన కొలీగ్స్ లో చాలా మంది యంగ్ గా కనిపించడం కోసం, వారి వయసు కనపడకుండా ఉండడానికి పలు సర్జరీలు చేయించుకున్నారని.. తనకు తెలిసిన చాలా మంది హీరోయిన్లు ముఖాన్ని, బాడీ షేప్ కోసం సర్జరీలు చేయించుకున్నారని చెప్పింది రాధికా ఆప్టే. అదంతా తనవల్ల కాదని తెలిపింది.
శరీరాకృతి గురించి పట్టించుకోవద్దని లెక్చర్లు ఇచ్చేవాళ్లు కూడా సర్జరీ చేయించుకుంటూ ఉంటారని.. అలాంటి వారిని చూసి విసిగిపోయానని తెలిపింది రాధికా ఆప్టే. ఇండస్ట్రీలో ఉండేవారంతా అదే రకమని చెప్పింది. అలానే తనకు బీ-టౌన్ లో పార్టీలకు వెళ్లడం నచ్చదని.. అవన్నీ అనవసరమనిపిస్తాయని చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈమె 'విక్రమ్ వేద' రీమేక్ లో నటిస్తోంది. అలానే ఆమె నటించిన రెండు, మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Also Read: పాకిస్తానీ సినిమాకు Cannes 2022లో అవార్డులు - 'జాయ్ ల్యాండ్' ప్రత్యేకత ఏంటి?
Also Read: 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
View this post on Instagram