Srivalli Bengali Song: 'శ్రీవల్లి' సాంగ్ బెంగాల్ వెర్షన్ చూశారా? ఆ సాంగ్ పాడిన టాప్ సింగర్ ఎవరో తెలుసా?
'పుష్ప' విడుదలై రెండు నెలలు. కానీ, సినిమా ఫీవర్ ఇంకా తగ్గలేదు. సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఇప్పుడు 'శ్రీవల్లి...' సాంగ్ బెంగాల్ వెర్షన్ విడుదలైంది. ఆ సాంగ్ పాడిన టాప్ సింగర్ ఎవరో తెలుసా?
పుష్ప... పుష్పరాజ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరు! - 'పుష్ప: ద రైజ్' సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైలాగ్ ఇది. సినిమాలో డైలాగులు, పాటలు సూపర్ ఫైరులా ప్రేక్షకుల్లోకి దూసుకు వెళ్లాయి. చాలా మంది సెలబ్రిటీలు కూడా 'పుష్ప'లో పాటలకు డ్యాన్సులు చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం... ఐదు భాషల్లో సినిమా విడుదల అయ్యింది. ఇప్పుడు కొత్త భాషల్లోకి కూడా 'పుష్ప' పాటలు వెళ్తున్నాయి.
'పుష్ప: ద రైజ్' విడుదలయ్యి రెండు నెలలు కావొస్తోంది. కానీ, సినిమా ఫీవర్ ఇంకా తగ్గలేదు. సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. లేటెస్టుగా 'పుష్ప'లోని 'శ్రీవల్లి...' సాంగ్ బెంగాల్ వెర్షన్ (Srivalli Bengali Song) విడుదలైంది. ఫేమస్ సింగర్ ఉషా ఉతుప్ ఆ పాటను ఆలపించారు. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ రోజు 'శ్రీవల్లి...' బెంగాల్ సాంగ్ ప్రోమో విడుదల చేసింది. ఫుల్ సాంగ్ ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు తెలిపారు.
అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప: ద రైజ్' సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇందులో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, రావు రమేష్, అజయ్ ఘోష్, ధనుంజయ తదితరులు సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.
Also Read: 'వలిమై' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
Also Read: వీడియో: ‘శ్రీవల్లి’ పాటను 4 భాషల్లో కలిపి కుమ్మేశాడు, ఇది కదా ‘పుష్ప’ మనకు కావాల్సింది!
View this post on Instagram