News
News
X

Valimai Movie Review - 'వలిమై' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?

Valimai Movie Review Telugu: 'ఖాకి'తో తెలుగులోనూ దర్శకుడు హెచ్. వినోద్ హిట్ అందుకున్నారు. అజిత్ హీరోగా ఆయన తీసిన 'వలిమై' త‌మిళ్‌తో పాటు తెలుగులోనూ నేడు విడుదలైంది. #ValimaiReview #ValimaiFDFS

FOLLOW US: 

సినిమా రివ్యూ: వలిమై
రేటింగ్: 2.5/5
నటీనటులు: అజిత్, కార్తికేయ గుమ్మకొండ, హ్యూమా ఖురేషి తదితరులు
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా
నేపథ్య సంగీతం: జిబ్రాన్
స్వరాలు: యువన్ శంకర్ రాజా
నిర్మాత: బోనీ కపూర్ 
దర్శకత్వం: హెచ్. వినోద్
తెలుగులో విడుదల: ఐవీవై ప్రొడ‌క్ష‌న్స్ (గోపీచంద్ ఇనుమూరి)
విడుదల తేదీ: ఫిబ్రవరి 24, 2022

'ఖాకి' సినిమా తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. కార్తీకి తెలుగులో మంచి విజయం అందించింది. ఆ సినిమా దర్శకుడు హెచ్. వినోద్ తీసిన తాజా చిత్రం 'వలిమై'. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, నిర్మాత బోనీ కపూర్‌తో ఆయనకు రెండో చిత్రమిది. ఈ సినిమా కంటే ముందు హిందీ హిట్ 'పింక్'ను తమిళంలో 'నెర్కొండ పార్వై'గా రీమేక్ చేశారు. అది తెలుగులో విడుదల కాలేదు. కానీ, 'వలిమై' అదే పేరుతో తమిళ్‌తో పాటు తెలుగులో ఈ రోజు విడుదలైంది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ రోల్ చేశారు. బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి నటించారు. ఈ సినిమా ఎలా ఉంది?

కథ: విశాఖలో వరుసగా నేరాలు (హత్యలు, చైన్ స్నాచింగ్స్, డ్రగ్స్ దందా) జరుగుతుంటాయి. మరోవైపు యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారతారు. ప్రజల్లో పోలీసులపై పెల్లుబికిన ఆగ్రహావేశాలు చూసి పోలీస్ ఉన్నతాధికారి ఎంతో ఆవేదన చెందుతారు. సరైన పోలీస్ ఆఫీసర్ కోసం ఎదురు చూస్తుంటే... ఏసీ అర్జున్ కుమార్ (అజిత్ కుమార్) విజయవాడ నుంచి విశాఖకు బదిలీ అవుతాడు. విశాఖలో నేరాలు అన్నిటికీ ఓ బైకర్స్ గ్యాంగ్ కారణం అని తెలుసుకుంటాడు. ఆ గ్యాంగ్ లీడర్ నరేన్ (కార్తికేయ) ను అర్జున్ ఎలా పట్టుకున్నాడు? నేరస్థులను పట్టుకోవడం మానేసి అర్జున్ వెనుక పోలీసులు ఎందుకు పరులు తీశారు? అతడిని చంపాలని ఎందుకు ఫైరింగ్ చేశారు? అనేది మిగతా సినిమా.


విశ్లేషణ: 
'బలం అమితమైన బలం ఇప్పుడు అదే అవసరం'
సినిమా చివర్లో దర్శకుడు హెచ్. వినోద్ ఇచ్చిన సందేశం ఇది. దీనిని ఎదుర్కోవడానికి మనకి బలం కావాలి? ఎటువంటి సందర్భాల్లో మనకి బలం కావాలి? అంటే... పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మత్తు పదార్థాల వైపు, నేరాలు చేయాలనే ఆలోచన వైపు అడుగులు వేయకుండా ధైర్యంగా నిలబడే బలం యువతకు కావాలి. 'వలిమై'లో ఇచ్చిన సందేశం ఇదే.‌ ప్రేక్షకులకు ఆ సందేశం బలంగా చేరాలంటే ఓ బలమైన కథానాయకుడు కావాలి.‌ వినోద్ చెప్పిన కథ నచ్చిందో? 'ఖాకి'లో అతడు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించిన విధానం నచ్చిందో? తమిళ స్టార్ హీరో అజిత్ 'వలిమై' చేసే అవకాశం ఇచ్చారు. అయితే... సినిమా చూసిన తర్వాత అజిత్ కోసం ద‌ర్శ‌కుడు వినోద్ కొన్ని సన్నివేశాలను క‌థ‌లో బలవంతంగా ఇరికించారేమో? అనే అనుమానం కలుగుతుంది.

'వలిమై' చూసి థియేటర్లలోనుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులకు బాగా గుర్తు ఉండేది కథో, అజిత్ నటనో, సినిమాలో ట్విస్టులో కాదు.‌ యాక్షన్ దృశ్యాలు! అవును... సినిమాలో యాక్షన్ దృశ్యాలు ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి తీసుకు వెళతాయి. బైక్ స్టంట్స్ కావచ్చు... బస్ స్టంట్ కావచ్చు... పోలీస్ ట్రెజరరీలో స్టంట్ కావచ్చు... సినిమాలో ప్రతీ యాక్షన్ సీక్వెన్స్ అదుర్స్ అంతే! ప్రేక్షకుడు కథను మర్చిపోయి... కళ్లప్పగించి అలా తెరను చూసేలా చేయగల శక్తి యాక్షన్ సన్నివేశాలకు ఉందని నిరూపించిన చిత్రమిది. ఈ ఈ విషయంలో స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్, దర్శకుడు వినోద్... ఇద్దరిని ప్రత్యేకంగా అభినందించాలి.

'ఖాకి'లోనూ దర్శకుడు హెచ్. వినోద్ యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు.‌ అయితే... కథ, కథనం ప‌రంగా 'ఖాకి'ని నడిపించినంత రేసీగా 'వలిమై'ను తీయడంలో తడబడ్డారు. అజిత్ కోసమో? కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే తాపత్రయమో? కారణం ఏదైనా బలవంతంగా ఇరికించిన మదర్ సెంటిమెంట్ సీన్స్ సినిమాకు స్పీడ్ బ్రేకర్స్ అయ్యాయి. సినిమాలో ఎప్పుడు మదర్ సెంటిమెంట్ సీన్స్ వచ్చినా ప్రేక్షకులకు బోరింగ్ మూమెంట్ స్టార్ట్ అయినట్టే. అవి రొటీన్‌గా ఉన్నాయి. అయితే...  ఆ సీన్స్ తర్వాత, లేదంటే ముందు వచ్చే యాక్షన్ సీన్స్ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఉన్నాయి. ఆ యాక్షన్ సీన్స్ కోసమైనా ఒక్కసారి సినిమా చూడొచ్చు.

స్వతహాగా బైక్ రేసర్ అయిన అజిత్, యాక్షన్ సీన్స్ అద్భుతంగా చేశారు. ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో ఆయన పోలీస్ అధికారిగా కనిపించారు. ఈ సినిమాలో మరోసారి పోలీస్ రోల్ చేసినా... గత సినిమాలకు, ఈ సినిమాకు డిఫరెన్స్ చూపించారు. అయితే, అజిత్ కొంచెం లావుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అజిత్ తర్వాత విలన్ రోల్ చేసిన కార్తికేయకు సినిమాలో ఎక్కువ స్కోప్ లభించింది. ప్రథమార్థంలో అతడు కనిపించింది తక్కువసేపే అయినా... ద్వితీయార్థంలో ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ లభించింది. నటుడిగా కార్తికేయకు మంచి పేరు వస్తుంది. అతను కూడా బాగా చేశారు. హ్యూమా ఖురేషి తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు. నిరవ్ షా సినిమాటోగ్రఫీ సూపర్బ్. జిబ్రాన్ నేపథ్య సంగీతం బావుంది. కానీ, పాటలు కథకు అడ్డు తగిలాయి. గుర్తుంచుకునే పాట ఒక్కటీ లేదు.

Also Read: 'సన్ ఆఫ్ ఇండియా' రివ్యూ: వికటించిన ప్రయోగం!

యాక్షన్ సీన్స్ బావుంటే చాలు.. కథ ఎలా ఉన్నా పర్వాలేదని అనుకునే ప్రేక్షకులు 'వలిమై'కు వెళ్లవచ్చు. 'వలిమై'కు యాక్షన్ సీన్స్ బలం అయితే... ఫ్యామిలీ ఎమోషన్స్ బలహీనత. ఫస్టాఫ్ ప్లస్ అయితే... సెకండాఫ్ మైనస్! ఇదొక యాక్షన్ థ్రిల్లర్. అందులో ఫ్యామిలీ ఎమోషన్స్ సరిగా మిక్స్ కాలేదు. అదీ సంగతి! తమిళనాడులో అజిత్ అభిమానులకు అయితే ఈ సినిమా ఫుల్ మీల్స్ కింద ఉంటుంది ఏమో!? తెలుగులో మాత్రం ఒక నార్మల్ సినిమా అని చెప్పాలి.

Also Read: ఎ థర్స్‌డే రివ్యూ: థ్రిల్ చేసే హోస్టేజ్ డ్రామా!

 
Published at : 24 Feb 2022 12:32 PM (IST) Tags: ABPDesamReview valimai movie review valimai review Valimai Telugu Review Valimai Review in Telugu Ajith Valimai Review  Kartikeya Performance In Valimai

సంబంధిత కథనాలు

Sanjay Dutt: ప్రభాస్, మారుతి సినిమా - సంజయ్ దత్ ఒప్పుకుంటారా?

Sanjay Dutt: ప్రభాస్, మారుతి సినిమా - సంజయ్ దత్ ఒప్పుకుంటారా?

Chiranjeevi Salmankhan: ఆ సత్తా సల్మాన్ కే ఉంది, అందుకే ‘గాడ్ ఫాదర్’ సెట్లో అడుగు పెట్టాడు: చిరంజీవి

Chiranjeevi Salmankhan: ఆ సత్తా సల్మాన్ కే ఉంది, అందుకే ‘గాడ్ ఫాదర్’ సెట్లో అడుగు పెట్టాడు: చిరంజీవి

Chiyaan Vikram: బాబోయ్ చియాన్, మన ఆలయాల నుంచి పిరమిడ్స్ దాకా, బాలీవుడ్ మీడియాకు క్లాస్ తీసుకున్న విక్రమ్!

Chiyaan Vikram: బాబోయ్ చియాన్, మన ఆలయాల నుంచి పిరమిడ్స్ దాకా, బాలీవుడ్ మీడియాకు క్లాస్ తీసుకున్న విక్రమ్!

Bigg Boss 6 Telugu: గలీజు దొంగని నేను అంటున్న ఆరోహి, గీతూ మాటతీరు ఇక మారదా సామి, నామినేషన్లో ఆ పదిమంది

Bigg Boss 6 Telugu: గలీజు దొంగని నేను అంటున్న ఆరోహి, గీతూ మాటతీరు ఇక మారదా సామి, నామినేషన్లో ఆ పదిమంది

Naga shourya- Jr NTR: ఎన్టీఆర్ భార్య నాగ శౌర్యకు చెల్లి అవుతుందా? తొలిసారి క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో!

Naga shourya- Jr NTR: ఎన్టీఆర్ భార్య నాగ శౌర్యకు చెల్లి అవుతుందా? తొలిసారి క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో!

టాప్ స్టోరీస్

Hyderabad Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం, ఈ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Hyderabad Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం, ఈ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

Minister RK Roja : టీడీపీ జంబలకడిపంబ పార్టీ, ఆడవాళ్లు తొడలు కొడతారు మగవాళ్లు ఏడుస్తారు- మంత్రి రోజా

Minister RK Roja : టీడీపీ జంబలకడిపంబ పార్టీ, ఆడవాళ్లు తొడలు కొడతారు మగవాళ్లు ఏడుస్తారు- మంత్రి రోజా

Loan App Suicide : 'అమ్ము ఐ యామ్ సారీ, ఇంకా బతకాలని లేదు', లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి!

Loan App Suicide : 'అమ్ము ఐ యామ్ సారీ, ఇంకా బతకాలని లేదు', లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి!

NASA's DART Spacecraft: డార్ట్ మొదటి ప్రయోగం కాసేపట్లో - ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో ఢీ!

NASA's DART Spacecraft: డార్ట్ మొదటి ప్రయోగం కాసేపట్లో - ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఆస్టరాయిడ్‌తో ఢీ!