వీడియో: ‘శ్రీవల్లి’ పాటను 4 భాషల్లో కలిపి కుమ్మేశాడు, ఇది కదా ‘పుష్ప’ మనకు కావాల్సింది!
‘పుష్ప’లో శ్రీవల్లి పాటను ఇతడు 4 భాషల్లో కంఠస్తం పట్టేశాడు. ఆ భాషలన్నీ కలిపి ఆ పాటను ఎంత చక్కగా ఆలపించాడో చూడండి.
‘పుష్ప’ తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు, కేరళలో అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి మనకు తెలిసిందే. అయితే, ‘పుష్ప: ది రైజింగ్’ సినిమాతో బాలీవుడ్‌లో కూడా బన్నీకి ఎక్కడాలేని క్రేజ్ లభించింది. ఆ చిత్రంలోని డైలాగ్స్ నుంచి పాటలు, డ్యాన్స్ వరకు ఒక్కటి కూడా వదలకుండా రీల్స్, షార్ట్స్ వీడియోలతో నెటిజనులు రచ్చ రంబోలా చేస్తున్నారు. ఇవి సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ట్విట్టర్‌లో ఓ వ్యక్తి ‘పుష్ప’ సినిమాలోని ‘శ్రీవల్లి’ పాటను నాలుగు భాషల్లో పాడి వినిపించి ఆశ్చర్యపరిచాడు. అయితే, అతడు ఏదో సాదాసీదాగా పడాడు అనుకుంటే పొరపాటే. చక్కని గాత్రంతో.. సినిమాలో ఉన్నట్లుగానే ఎంతో చక్కగా ఆలపించాడు. తొలుత తెలుగుతో శ్రీవల్లి పాటను మొదలుపెట్టి.. తమిళం, హిందీ, మలయాళంలో ఆపకుండా ఆలపించాడు. నాలుగు భాషలను ఒకే పాటగా మార్చి పాడేశాడు. చివరిలో హిందీ భాషతోనే పాటను ముగించాడు.
Also Read: తేడా ఉండాలిగా! ట్రైలర్‌లో అన్నీ ఆశిస్తే ఎలా? - మిక్డ్స్ టాక్ గురించే తమన్ ఆ ట్వీట్ చేశారా?
ఈ పాటను ఐపీఎస్ అధికారి దీపాన్సు కాబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘‘పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను ఐదు వేర్వేరు భాషల్లో ఆలపించిన ఇతడి టాలెంట్ అద్భుతం. మీరు కూడా వినండి’’ అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అతడు నాలుగు భాషల్లోనే ఆలపించాడు. హిందీని రెండుసార్లు ఆలపించడంతో ఆయన మొత్తం 5 వేర్వేరు భాషలని పేర్కొన్నాడు. అయితే, ఈ పాట నిజంగానే అతడు ఆలపించాడా? లేదా ఐదు భాషల్లోని పాటలను ఎడిట్ చేసి ఇలా క్రియేట్ చేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ పాటను చూసి మీ అభిప్రాయం కూడా చెప్పండి మరి.
#PushpaTheRise फ़िल्म का #Srivalli गीत, 5 अलग-अलग भाषाओं में.
— Dipanshu Kabra (@ipskabra) February 22, 2022
हुनरमंद गायक द्वारा गज़ब की कलात्मक प्रस्तुति.
ज़रूर सुनें. pic.twitter.com/LGWtdzyhCj
Also Read: గొడవ సెటిల్ అయిపోయినట్లేనా? బుక్ మై షోలో 'భీమ్లా నాయక్'
View this post on Instagram