అన్వేషించండి
Advertisement
Salaar: ప్రభాస్ 'సలార్'లో టాలెంటెడ్ యాక్టర్స్ - పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్!
కొన్నాళ్లుగా పృథ్వీరాజ్ ను 'సలార్' సినిమాలో తీసుకుంటారని వార్తలొచ్చాయి. కానీ ఆ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించలేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్' అనే సినిమాలో నటిస్తున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు ప్రభాస్. అందులో ఒకటి రగ్డ్ అండ్ మ్యాన్లీ లుక్ కాగా.. మరొకటి కొంచెం క్లాస్ గా కనిపించే క్యారెక్టర్ అని తెలుస్తోంది. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
మొదట ఈ సినిమాను ఏప్రిల్ 14, 2022లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత సినిమా విడుదలకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 28, 2023లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది చిత్రబృందం. ఈ మేరకు వేసిన ట్వీట్ లో కొందరు ఆర్టిస్ట్ లను ట్యాగ్ చేశారు. అందులో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రముఖ నటి శ్రియారెడ్డి పేర్లు ఉన్నాయి.
కొన్నాళ్లుగా పృథ్వీరాజ్ ను ఈ సినిమాలో తీసుకుంటారని వార్తలొచ్చాయి. కానీ ఆ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించలేదు. రిలీజ్ డేట్ తో పాటు ఈ విషయాన్ని వెల్లడించింది 'సలార్' టీమ్. పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపిస్తారట. అలానే యష్ కూడా తళుక్కున మెరుస్తాడట. యష్ గెస్ట్ రోల్ అనగానే.. మల్టీవర్స్ కాన్సెప్ట్ అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ సినిమాలో ఇంతమంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ లు ఉండడంతో సినిమాపై మరింత బజ్ పెరిగిపోతుంది.
ఫ్యాన్స్ కోసం స్పెషల్ ఎలిమెంట్స్:
ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ కోసం చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. శ్రద్దా కపూర్ తో ఐటెం సాంగ్ ఉండబోతుందని సమాచారం. అలానే ఒక యాక్షన్ ఎపిసోడ్ ని ఓ పెద్ద లోయలో షూట్ చేయబోతున్నారట. ఈ ఎపిసోడ్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు. పిక్చరైజేషన్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందట. మొత్తానికి ఈ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫీవర్ తెప్పించేలా ఉన్నారు ప్రశాంత్ నీల్.
మరోపక్క ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే నాగశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K' సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' సినిమా కమిట్ అయ్యారు. ఈ సినిమాల మధ్యలో దర్శకుడు మారుతి తీయబోయే ఓ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తారని అంటున్నారు.
'𝐑𝐄𝐁𝐄𝐋'𝐋𝐈𝐍𝐆 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 𝐎𝐍 𝐒𝐄𝐏 𝟐𝟖, 𝟐𝟎𝟐𝟑.#Salaar #TheEraOfSalaarBegins#Prabhas @prashanth_neel @VKiragandur @hombalefilms @shrutihaasan @PrithviOfficial @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @anbariv @SalaarTheSaga pic.twitter.com/8vriMflG84
— Salaar (@SalaarTheSaga) August 15, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion