News
News
X

Project K: రెండు భాగాలుగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' - ఫ్యాన్స్‌కి పండగే!

ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

FOLLOW US: 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల 'ఆదిపురుష్' సినిమాను పూర్తి చేసిన ఆయన ఇప్పుడు 'సలార్', 'ప్రాజెక్ట్ K' సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మధ్యలో 'సాహో', 'రాధేశ్యామ్' రూపంలో పెద్ద ప్లాప్స్ వచ్చినా.. ప్రభాస్ రేంజ్ మాత్రం తగ్గలేదు. ఆయన నటిస్తోన్న సినిమాల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్ K'లో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరించనున్నారట. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలను రెండేసి భాగాలుగా చిత్రీకరించి రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 

ఇప్పుడు 'ప్రాజెక్ట్ K' కూడా అదే రూట్ లో నడవనుంది. కథ పరంగా చూసుకుంటే ఈ సినిమా స్పాన్ చాలా ఎక్కువ. అందుకే పార్ట్ 2 తీయాలని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. ఈ విషయాన్ని 'ప్రాజెక్ట్ K' పతాక సన్నివేశాల్లో చెప్పబోతున్నారట. ఈ సినిమాలో కొన్ని ప్రశ్నలకు సమాధానం పార్ట్ 2లో తెలుస్తుందట. అంటే దర్శకుడు నాగ్ అశ్విన్ కి ఇప్పట్లో ప్రభాస్ ను వదిలే ఆలోచన లేదనిపిస్తుంది. ఈ సినిమా కూడా రెండు పార్ట్స్ అంటే ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. 

అవెంజర్స్ రేంజ్ లో 'ప్రాజెక్ట్ K':

'ప్రాజెక్ట్ K' ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతుందని నిర్మాత అశ్వనీదత్ రీసెంట్ గా చెప్పారు. డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుందని.. 9 నెలలు గ్రాఫిక్స్ కోసం కేటాయించామని తెలిపారు. హాలీవుడ్ అవెంజర్స్ రేంజ్ లో 'ప్రాజెక్ట్ K' ఉంటుందని అన్నారు. ఈ సినిమాతో చైనా, అమెరికా మార్కెట్ ని టార్గెట్ చేస్తామని చెప్పుకొచ్చారు.

సూపర్ హీరోగా ప్రభాస్:

ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపిస్తారని సమాచారం. 'ఆదిపురుష్'లో శ్రీరాముడిగా కనిపించనున్న ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' కోసం సూపర్ హీరో అవతారమెత్తనున్నారు. ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది చిత్రబృందం. ప్రభాస్ పుట్టినరోజు నాడు సూపర్ హీరో అని మెన్షన్ చేస్తూ అతడికి విషెస్ చెప్పింది.

Project K Release Date:

అక్టోబర్ 18, 2023న 'ప్రాజెక్ట్ K' సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ ఆ తేదీకి విడుదల చేయలేని పక్షంలో 2024 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ

Also Read: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?

Published at : 16 Aug 2022 03:19 PM (IST) Tags: Prabhas Nag Ashwin Project K movie Ashwanidutt

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!

Adipurush: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో 'Disappointed' హ్యాష్ ట్యాగ్!

Adipurush: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో  'Disappointed' హ్యాష్ ట్యాగ్!

Rahul Ramakrishna: ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’.. నటుడు రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు!

Rahul Ramakrishna: ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’.. నటుడు రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు!

Colours Swathi: విడాకుల కోసం కోర్టుకెక్కిన కలర్స్ స్వాతి, అప్పుడు వద్దన్నా పెళ్లి చేసుకుని ఇప్పుడిలా!

Colours Swathi: విడాకుల కోసం కోర్టుకెక్కిన కలర్స్ స్వాతి,  అప్పుడు వద్దన్నా పెళ్లి చేసుకుని ఇప్పుడిలా!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

టాప్ స్టోరీస్

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

CM Jagan : సీఎం జగన్ ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

CM Jagan : సీఎం జగన్  ఉదారత, చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు

మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ సరిపోలేదు - మ్యాచ్, సిరీస్ రెండూ మనవే!

మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ సరిపోలేదు - మ్యాచ్, సిరీస్ రెండూ మనవే!

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!